విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. నాని నిర్మించిన హిట్ యొక్క హిందీ రీమేక్ రైట్స్ ను తెలుగు సినిమా దిల్ రాజు దక్కించుకుని అక్కడ రీమేక్ చేయడం జరిగింది. హిందీ రీమేక్ కు ఒరిజినల్ వర్షన్ కు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.
దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో రాజ్ కుమార్ రావ్ హీరోగా నటించాడు. తెలుగు లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న హిట్ హిందీ వర్షన్ హిట్ ను మాత్రం దక్కించుకోలేక పోయింది. ఎన్నో ఆశలు మరియు అంచనాల నడుమ హిందీ లో రీమేక్ చేసిన దర్శకుడు శైలేష్ కొలనుకు తీవ్ర నిరాశ ఎదురయ్యిందని చెప్పాలి.
హిట్ సినిమా అక్కడ విజయాన్ని సొంతం చేసుకుని ఉంటే కచ్చితంగా శైలేష్ కి హిందీ స్టార్ హీరోల నుండి ఆఫర్స్ వచ్చేవి. కానీ హిందీ హిట్ తర్వాత వెంటనే హిట్ 2 ను తెలుగు లో తెరకెక్కించాడు. హిట్ మాదిరిగానే హిట్ 2 కూడా హిట్ అయ్యింది. దాంతో శైలేష్ కొలను మళ్లీ సక్సెస్ ట్రాక్ లో ఎక్కాడు.
హిట్ 2 సక్సెస్ నేపథ్యంలో మళ్లీ హిందీలో రీమేక్ గురించిన వార్తలు వస్తున్నాయి. హిట్ 2 ను హిందీలో విడుదల చేయలేదు. కనుక ఇప్పుడు అక్కడ రీమేక్ చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. మరి శైలేష్ యొక్క నిర్ణయం ఏంటీ అనేది తెలియాల్సి ఉంది.
హిట్ తో ఫ్లాప్ అయిన శైలేష్ హిట్ 2 సక్సెస్ దక్కించుకుంటాను అంటూ మళ్లీ హిందీ కి వెళ్తే తప్పుడు నిర్ణయం అవుతుంది.
అందుకే హిట్ 2 రీమేక్ ఆఫర్ వచ్చినా శైలేష్ అక్కడకు వెళ్లకుండా హిట్ 3 సినిమా యొక్క పనులు మొదలు పెడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. హిందీ పై మోజుతో వెళ్లిన జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పరిస్థితి ఏమయ్యిందో తెల్సిందే. అందుకే శైలేష్ కొలను అక్కడికి మరోసారి వెళ్లి చేతులు కాల్చుకోవడం మంచిది కాదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.