సపోర్టింగ్ పాత్రలతో కెరీర్ ప్రారంభించిన హీరో సిద్దూ జొన్నలగడ్డ. హీరోగా తనని తాను నిరూపించుకోవడం కోసం రైటర్ గా కూడా అవతారమెత్తిన ఈ యంగ్ హీరో మొత్తానికి ప్రవీణ్ సత్తాను తెరకెక్కించిన 'ఎల్బీడబ్ల్యూ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత 'గుంటూర్ టాకీస్' మూవీలో హీరోగా నటిస్తూనే రైటర్‌గా, సింగర్ గా మారి మరో హిట్ ని సొంతం చేసుకున్నాడు. అయితే రీసెంట్ గా విడుదలైన 'డీజే టిల్లు' మూవీతో రైటర్ గా, హీరోగా తిరుగులేని కమర్షియల్ సక్సెస్ ని సొంతం చేసుకున్నాడు.
ఈ మూవీ హిట్ తో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న సిద్ధూ జొన్నలగడ్డ ఇకపై కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే 'డీజే టిల్లు' మూవీని నిర్మించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'కప్పెల' మూవీ రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకుని సిద్దూ జొన్నలగడ్డ, మరో హీరోతో తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేసింది. అయితే ఇందులో సిద్దూది నెగెటివ్ క్యారెక్టర్.
'డీజే టిల్లు' వంటి హిట్ మూవీ తరువాత నెగెటివ్ క్యారెక్టర్ చేయడం అంటే ఆ క్రేజ్ ని చేజేతులా కిల్ చేసుకోవడమే. ఈ విషయాన్ని గ్రహించిన సిద్దూ ఈ ప్రాజెక్ట లో ఆ పాత్రని తాను చేయలేనని 'కప్పెల' రీమేక్ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నాడు. దీంతో సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు సిద్దూ జొన్నలగడ్డ స్థానంలో మరో యంగ్ హీరోని ఆ పాత్ర కోసం ఎంపిక చేసుకుని ఆలస్యంగా 'కప్పెల' రీమేక్ ని ప్రారంభించారు.
ఇదిలా వుంటే సిద్దూ జొన్నలగడ్డ తాజాగా మరో మలయాళ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. టివినో థామస్ నటించిన 'తళ్లుమాల' మూవీ రీమేక్ హక్కుల్ని నైజాం కు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ రూ. 85 లక్షలు వెచ్చించి ఈ మూవీ తెలుగు రీమేక్ హక్కుల్ని దక్కించుకున్నారట. జులాయి గ్యాంగ్ గొడవల నేపథ్యంలో సాగే ఈ మూవీ కోసం సదరు డిస్ట్రిబ్యూటర్ సిద్ధూ జొన్నలగడ్డని ఈ మూవీ కోసం ఎంపిక చేసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
టైలర్ మేడ్ క్యారెక్టర్ గా హీరో పాత్ర నిలిచే ఈ మూవీలో అయినా సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తాడా? లేక 'డీజే టిల్లు' సీక్వెల్ కోసం ఈ మూవీని కూడా వదిలేస్తాడా? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ఈ రీమేక్ కు సంబంధించిన డైరెక్టర్ ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. మంచి దర్శకుడి కోసం చిత్ర బృందం అన్వేషణ చేస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.