స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు టైటిల్ రోల్ లో నటించిన సినిమా ''యశోద''. హరి & హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్ - వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. సరోగసీ నేపథ్యంలో ఆసక్తికరమైన పాయింట్ తో రూపొందించిన ఈ సినిమా నవంబర్ 11న విడుదల కాబోతోంది.
‘యశోద’ అనేది సమంత కు ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న మూవీ. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో భారీ ఎత్తున థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సామ్ సైతం ప్రమోషన్స్ లో పాల్గొనడానికి రెడీ అయింది. సినిమా కోసం ఓ ఇంటర్వ్యూని రికార్డ్ చేసి వదలబోతున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ గురించి చర్చ జరుగుతోంది.
'యశోద' కథను మూడు నాలుగు కోట్ల బడ్జెట్ తో ఒక చిన్న సినిమాగా చేయాలని దర్శక ద్వయం భావించారట. అయితే శంకర్ సినిమా తరహాలో పెద్ద పాయింట్ కావడంతో.. భారీ బడ్జెట్ తో తెరకెక్కించామని.. ‘పుష్ప’ ‘కేజీఎఫ్’ సినిమాలను మల్టీలాంగ్వేజ్ లో డబ్బింగ్ చేస్తున్నపుడు తమ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని అనుకున్నట్లు నిర్మాత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అయితే చాలా కాలంగా నిర్మాణ దశలో ఉన్న 'యశోద' చిత్రానికి అన్నీ కలుపుకొని దాదాపు 40 కోట్ల వరకూ ఖర్చు అయిందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ కథను నమ్మి మరో నిర్మాత చింతా గోపాలకృష్ణరెడ్డి సహకారంతో ఈ సినిమా చేసినట్లు తెలుస్తోంది. అయితే సమంత మీద అన్ని కోట్ల పెట్టుబడి పెట్టడంపై ఓ వర్గం ఫ్యాన్స్ నెట్టింట పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. సామ్ పై అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి సమంత సినిమాకు 30 కోట్ల వరకూ బడ్జెట్ అవ్వగా.. పబ్లిసిటీ ఖర్చులు మరియు వడ్డీలు కలుపుకొని నలభై కోట్లు అయిందనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఇదే స్థాయిలో బడ్జెట్ పెట్టిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సామ్ మూడేళ్ళ క్రితం నటించిన 'ఓ బేబీ' లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి 16 – 20 కోట్ల వరకూ పెట్టుబడి పెడితే.. 34 – 40 కోట్ల వరకూ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల నివేదికలు చెబుతున్నాయి.
అలానే పలువురు మీడియం రేంజ్ హీరోలతో సమంత నటించిన చిత్రాలు 50 కోట్ల మార్క్ దాటాయంటే.. అందులో ఆమె పాత్ర చాలా ఉందని చెప్పాలి. అందులోనూ 'పుష్ప' ఐటెం సాంగ్ మరియు 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ కారణంగా సామ్ కు పాన్ ఇండియా వైడ్ గుర్తింపు వచ్చింది. ఇవన్నీ ఆలోచించి అన్ని భాషల్లో చేయడానికి తగిన కథానాయిక అనుకునే నిర్మాతలు ఆమెపై అంత పెట్టుబడి పెట్టారని తెలుస్తోంది.
లేడీ ఓరియెంటెడ్ సినిమా.. అందులోనూ పాన్ ఇండియా లెవల్ అంటే రిస్క్ అనిపించలేదా? అని ఇటీవల నిర్మాతను ప్రశ్నించగా.. 'సినిమా బావుంటే ప్రేక్షకులు చూస్తారనే కాన్ఫిడెన్స్ ఉంది. ఫస్ట్ టైమ్ ఈ సినిమా విడుదలకు ముందే నాకు కంఫర్ట్ లెవల్ లోకి వచ్చింది. రిలీజ్ తర్వాత కూడా కంఫర్టబుల్ గా ఉంటాను' అని నమ్మకంగా చెప్పారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. నాన్ థియేట్రికల్ రూపంలో 'యశోద' సినిమా 30 కోట్లకు పైగానే రికవరీ చేసిందని తెలుస్తోంది.
అది కూడా డిజిటల్ రైట్స్ - రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు మరియు ఓవర్ సీస్ అమ్మడం ద్వారానే వచ్చాయని అంటున్నారు. 'యశోద' సినిమాని ఏపీ మరియు తెలంగాణలో సునీల్ నారంగ్ తో కలిసి రిలీజ్ చేస్తున్నారు. నార్త్ ఇండియాలో యూఎఫ్ఓ.. కర్ణాటకలో డిస్నీ వాళ్ళ ద్వారా సమంత సినిమా విడుదల అవుతోంది. తమిళ్ మరియు మలయాళంలో హీరో సూర్య కంపెనీ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ఇంకా శాటిటైల్ రైట్స్ ప్రొడ్యూసర్ వద్దనే ఉన్నాయి కనుక.. 'యశోద' సినిమాకు హిట్ టాక్ వస్తే మంచి లాభాలు వెనకేసుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిర్మాత కూడా అదే నమ్మకంతో ఉన్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.