అరవోళ్ళు అంత సాఫ్ట్ కాదేమో వర్మ

Update: 2019-04-01 06:56 GMT
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా బాగుందా లేదా అనే సంగతి పక్కన పెడితే ఏ ఉద్దేశంతో వర్మ ఇది తీశాడో ఏ లక్ష్యంతో నిర్మాత పెట్టుబడి పెట్టాడో అవి నెరవేరినట్టు వసూళ్లు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ కాకుండానే మంచి వసూళ్లు దక్కడం చూసి ట్రేడ్ సైతం ఆశ్చర్యపోతోంది. గత మూడు నెలల నుంచి వర్మ వేసిన మార్కెటింగ్ ఎత్తుగడలు చెప్పుకోదగ్గ ఫలితాన్ని ఇచ్చాయి. ఇన్వెస్ట్ మెంట్ లెక్కల్లో చూసుకున్నా ఇది లాస్ వెంచర్ కాదని తేలిపోయింది.

ఇదేదో బాగుందని వర్మ నెక్స్ట్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత  జయలిత శశికళల ఫ్రెండ్ షిప్ మీద కన్నేశాడు. తీశాడో లేదో తెలియదు కాని శశికళ టైటిల్ తో పోస్టర్ కూడా రిలీజ్ చేసి దాని పైన కమింగ్ సూన్ అని పెట్టాడు. మాములుగా షూటింగ్ అయిపోయిన సినిమాలకే అతి త్వరలో అని హెడ్డింగ్ పెడతారు. గత ఆరు నెలల నుంచి లక్ష్మీస్ ఎన్టీఆర్ లో బిజీగా ఉన్న వర్మ ఇదెప్పుడు తీశాడా అనే అనుమానం రావడం సహజం

సరే తీయలేదు అనుకున్నా తక్కువ టైంలో చుట్టేయడం వర్మకు పెద్ద విషయం కాదు. కాని అక్కడ ఇంకో రిస్క్ ఉంది. జయలలితను కించపరిచినా జైల్లో ఉన్న శశికళ మీద వ్యతిరేకంగా సినిమాలు తీసినా అక్కడ తంబీలు ఊరుకునే టైపు కాదు. అంతా ఒక మాట మీదకు వచ్చి ఏకమైతే జరిగే రచ్చ మాములుగా ఉండదు. ఇక్కడ స్థానిక బలం ఉంది కాబట్టి వర్మ ఏం చేసినా చెల్లింది. కాని చెన్నైలో అలా ఉండదు.

పైగా టైటిల్ లో కళ అనే పదాన్ని నల్లగా హై లైట్ చేసి నెగటివ్ క్యారెక్టర్ గా చూపించబోతున్నట్టు చెప్పకనే చెప్పాడు. సో నిజంగా శశికళ కార్యరూపం దాల్చితే మన దగ్గర పెద్దగా పట్టించుకోకపోవచ్చు కాని ఏ చిన్న తేడా వచ్చినా తమిళనాడులో నిరసనసెగలు మాములుగా ఉండవు. ఇవి తెలిసే వర్మ రంగంలోకి దిగుతున్నాడు కాబట్టి ఇంకోఏడాది దాకా తన పేరు మీడియాలో నానేలా ప్లానింగ్ చేసుకున్నట్టే
    

Tags:    

Similar News