అభిమానుల మధ్య స్టార్ వార్ ఆల్ టైమ్ హాట్ టాపిక్. సామాజిక మాధ్యమాల వెల్లువలో ఈ వార్ మరో లెవల్ కి చేరుకుంది. ట్వీట్లు.. ఇన్ స్టా కామెంట్లు.. ఎఫ్ బీలో చెణుకులు ఒకటేమిటి వీలున్న అన్ని మార్గాల్లోనూ ఒకరినొకరు తిట్టేసుకుంటూ నానా రచ్చ చేస్తున్నారు. ఒక్కోసారి ఆ వెర్రి అభిమానం బూతులు తిట్టుకునే వరకూ వెళుతోంది. బయట ఒకరికొకరు ఎదురు పడితే నరుక్కునేవరకూ వెళుతోంది. ఇటీవల తళా అజిత్- ఇలయదళపతి విజయ్ అభిమానుల మధ్య వార్ చూస్తుంటే ఇది మరీ టూమచ్ అని అనకుండా ఉండలేం. తంబీల వీరాభిమానం మరీ దారుణం. ఊర మాస్ అభిమానులు అక్కడ మరీ ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒకరేమో హీరో చనిపోయాడంటూ పోస్టర్లు వేస్తారు. ఇంకొకరేమో ఏకంగా గొడ్డలితో అవతలి అభిమానినే నరికాడు. ఈ గొడవ చూశాక.. మరీ ఇంత దారుణమా తంబీస్? అని సందేహం కలగకుండా ఉంటుందా?
ఓ రకంగా చూస్తే మన స్టార్ల ఫ్యాన్స్ చాలా బెటర్ అన్నది ఈ సంఘటనలు గుర్తు చేస్తున్నాయి. స్టార్లు చెబితే కొంతైనా వింటారు ఇక్కడ. అభిమానులు ప్రశాంతంగా ఉండాలని ఒకరి అభిమానుల్ని ఒకరు గౌరవించాలని మన హీరోలు కోరుకుంటారు. అంతేకాదు.. అన్ని సినిమాలు విజయం సాధించాలని పక్క హీరో బావుండాలని కోరుకుంటారు. ఒక హీరో సినిమాకి ఇంకో హీరో ప్రచారానికి రావడం అన్నది కూడా మనకే కనిపిస్తుంది. ఎన్టీఆర్- రామ్ చరణ్ మధ్య స్నేహానుబంధం ఇరువరి ఫ్యాన్స్ ని కలిపేసింది. ప్రభాస్ - బన్ని - చరణ్ అంతే గొప్ప ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక మహేష్ ఇంటికి వెళ్లేంత చనువు చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్లకు ఉంది. ఆ ఐదుగురు అగ్ర హీరోలు కలివిడిగా ఉండడం ఫ్యామిలీ ఫంక్షన్లలో కలుస్తూ సందడి చేయడం ఇప్పటికే అభిమానులకు కనెక్టవ్వడంతో చాలా వరకూ అనవసర రచ్చ లేదు మనకు. రానా లాంటి స్టార్ అందరూ హీరోలకు స్నేహితుడే. అభిమానుల మధ్య ఇది సఖ్యతను పెంచిందనే చెప్పాలి. సోషల్ మీడియాలో చిన్నపాటి వార్ ఉన్నా అది పరిధి మేరకే. మరీ తంబీల్లా కోసేసుకునేంత లేదు.
ఇకపోతే తమిళ స్టార్ హీరోల వ్యవహారం మన హీరోలతో పోలిస్తే చాలా డిఫరెంట్. అక్కడ సినిమా పరిశ్రమ రాజకీయాలతో ముడిపడి ఉంటుంది. హీరోల మధ్య డివైడ్ ఫ్యాక్టర్ ఎక్కువగా కనిపిస్తుంది. రజనీకాంత్ అభిమానులు.. శింబు అభిమానులు.. ధనుష్ అభిమానులు అని విడి విడిగా చూస్తారు. శింబు- ధనుష్ మధ్య వైరం అభిమానుల్ని డివైడ్ చేసింది. అలాగే తళా అజిత్ అమ్మ జయలలితకు సన్నిహితుడు. దాంతో జయలలితకు బద్ధ విరోధి అయిన ఇలయదళపతి విజయ్ అతడికి దూరం. ఫ్యాన్స్ మధ్య కూడా అది అగాధాన్ని పెంచి పోషించింది. పైపెచ్చు అభిమానుల మధ్య ఈ రచ్చ నిరంతరం కొనసాగుతూ ఉన్నా.. ఆ ఇద్దరు హీరోలు దీనిపై ఎంత మాత్రం స్పందించలేదు. దీంతో ఫ్యాన్ వార్ ఇంకా పీక్స్ కి చేరుకుంటోంది. రజనీ- కమల్ హాసన్ లాంటి వాళ్లు మాత్రమే స్నేహంగా ఉన్నారు. కానీ రాజకీయాల్లో ఆ ఇద్దరూ మళ్లీ ఎవరికి వారు సొంత పాలసీతో విరుద్ధంగా వెళుతున్నారు. ప్రతిదీ అక్కడ రాజకీయాలతో ముడిపడిన అంశంగా మారడంతో స్టార్ల ఫ్యాన్స్ మధ్య అది అగాధాన్ని పెంచి పోషిస్తోందని అర్థమవుతోంది. అయితే ఈ సన్నివేశం నుంచి ఫ్యాన్స్ ను బయటపడేసేందుకు అక్కడ స్టార్లంతా ఒకే గొడుగు కిందికి వచ్చి పరిష్కారం వెతికితే బావుంటుంది. అందుకు మన స్టార్ల స్నేహాల్ని వాళ్లు స్ఫూర్తిగా తీసుకుంటే తప్పేమీ కాదు.