షూటింగ్ ల బంద్ ఆ రోజే తేల‌నుందా?

Update: 2022-07-28 15:42 GMT
తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌స్తుతం గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. క‌రోనా కార‌ణంగా సినిమా షూటింగ్ లు ఆగిపోవ‌డం.. క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టాక తిరిగి మొద‌లు కావ‌డం తెలిసిందే. దీని కార‌ణంగా ప్రొడ్యూస‌ర్ల‌కు భారీగా బ‌డ్జెట్ లు పెరిగిపోయాయి. దీనికి తోడు సినిమా టికెట్ రేట్లు పెర‌గ‌డంతో ప్రేక్ష‌కులు పెద్ద‌గా థియేట‌ర్ల‌కు రావ‌డానికి ఆస‌క్తి చూపించ‌డం లేదు. దీంతో నిర్మాత‌ల పెట్టుబ‌డికి.. రాబ‌డికి ఎక్క‌డా పొంత‌ర వుండ‌టం లేద‌ట‌.

ఈ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం నేప‌థ్యంలో యాక్టీవ్ ప్రొడ్యూస‌ర్స్‌ గిల్డ్ ఆగ‌స్టు 1 నుంచి షూటింగ్ ల బంద్ కు సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌లు భారీ చిత్రాల నిర్మాణం ఇబ్బందిక‌రంగా మార‌బోతోంది. చిన్న సినిమాల‌తో పాటు బిగ్ స్టార్స్ కి సంబంధించిన క్రేజీ ప్రాజెక్ట్ లు గిల్డ్ బంద్ కార‌ణంగా ఎఫెక్ట్ కానున్నాయి. అయితే దీనిపై తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి మాత్రం అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తోంది.

షూటింగ్ ల బంద్ వ‌ల్ల స‌మ‌స్య‌లే కానీ ప‌రిష్కారాలు ల‌భించ‌వ‌ని వాదిస్తోంది. గిల్డ్ లో వున్న వాళ్లు త‌ప్ప ఏ నిర్మాత‌లు ఆగ‌స్టు 1 నుంచి షూటింగ్ ల బంద్ ని పాటించ‌ర‌ని ఖ‌రాకండీగా చెప్పేసింది. ఈ నేప‌థ్యంలో సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ సి. క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే. గిల్డ్ తో మాకు సంబంధం లేద‌ని, ఇండ‌స్ట్రీ న‌డుస్తోందే చిన్న నిర్మాత‌ల వ‌ల్ల అంటూ షూటింగ్ ల బంద్ పై ఫైర్ అయ్యారు.

గురువారం షూటింగ్ ల బంద్ నేప‌థ్యంలో మ‌రిన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. టాలీవుడ్ లో నెల‌కొన్న స‌మ‌స్య‌లకు ప‌రిష్కారం ఆగ‌స్టు మొద‌టి వారంలో ల‌భిస్తుంద‌ని తెలిపారు.

ఆగ‌స్టు 1 నుంచి షూటింగ్ లు బంద్ చేయాల‌నే గిల్డ్ నిర్ణ‌యంపై గురువారం తెలుగు ఫిల్మ్ చాంబ‌ర్ లో జ‌రిగిన స‌మావేం జ‌రిగింది. స‌మావేశం అనంత‌రం సి. క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మూడు ఆంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌న్నారు.

ఈ అంశాల‌పై ఈ నెల 30న మ‌రోసారి భేటీ అవుతామ‌ని, 31న జ‌ర‌గ‌నున్న జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ లో తుది నిర్ణ‌యం తీసుకోనున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. అంటే జూలై 31న జ‌రిగే ప్ర‌ధాన భేటీ షూటింగ్ ల బంద్ పై కీల‌క నిర్ణ‌యాన్ని వెల్ల‌డించ‌నుంద‌ని తెలుస్తోంది. మ‌రి దీనిపై ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ ఎలా స్పందిచ‌నుందో.. ఎలాంటి నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌నుంది అన్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది.    

Tags:    

Similar News