'ఉప్పెన' సినిమాతో స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా పరిచయమైన సానా బుచ్చిబాబు ఈ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతే కాకుండా తొలి సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరిన దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్నాడు కూడా. దీంతో అతని పేరు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. తన గురించి స్టార్ ప్రొడ్యూసర్స్, హీరోస్ ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు. అయితే 'ఉప్పెన' తరువాత బుచ్చిబాబు సాన తన తదుపరి ప్రాజెక్ట్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయడానికి రెడీ అయ్యాడు.
శ్రీకాకుళం నేపథ్యంలో సాగే ఓ స్పోర్ట్స్ డ్రామాగా.. పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి తీసుకురావాలనుకున్నాడు. అయితే ఇందులో ఓల్డ్ పాత్రలో నటించడానికి ఎన్టీఆర్ ఆసక్తిని చూపించలేదట.
అంతే కాకుండా వీర్ ఛైర్ కి మాత్రమే పరిమితం అయ్యే పాత్ర, వయసు మళ్లిన క్యారెక్టర్ కావడం వల్లే ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి ఆసక్తిని చూపించలేదట. 'పెద్ది' అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్టుగా ప్రచారం జరిగింది.
ఫైనల్ గా దీంతో బుచ్చిబాబు మరో హీరోని వెతికే పనిలో పడ్డాడు. ఫైనల్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు స్టోరీ చెప్పడం.. తను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం..రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించడం తెలిసిందే. 'కొన్ని సార్లు తిరుగుబాటు తప్పనిసరి అవుతుంది' అంటూ రామ్ చరణ్ తో చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించాడు బుచ్చిబాబు. ఇంటెన్సిటీతో వున్న పవర్ ఫుల్ క్యారెక్టర్ లో స్పోర్ట్స్ మెన్ గా రామ్ చరణ్ ఇందులో కనిపించబోతున్నాడు.
ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీ తెరపైకి రానుంది. ఈ సినిమాని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 'RRR' తరువాత రామ్ చరణ్ రేంజ్ మారిపోయిన విషయం తెలిసిందే. తన మార్కెట్ స్థాయిని కూడా దృష్టిలో పెట్టుకుని బుచ్చిబాబు ఈ ప్రాజెక్ట్ ని అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నాడు. ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ సమయంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఇది పాన్ ఇండియా మూవీ అని క్లారిటీ ఇచ్చారు.
ఇదిలా వుంటే ఈ మూవీలో రామ్ చరణ్ అథ్లెట్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ మూవీ బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన 'భాగ్ మిల్కా భాగ్' తరహాలో వుంటుందని, సరికొత్త నేపథ్యంలో ఈ మూవీ వుంటుందని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.