డెల్టా వేరియంట్ మ‌ళ్లీ టాలీవుడ్ ని దెబ్బేస్తుందా?

Update: 2021-07-29 07:01 GMT
``డెల్టా వేరియంట్ మామూలుది కాదు.. అది సోకిందంటే నాలుగు రోజులే!`` అంటూ ఒక‌టే గ‌డ‌బిడ చేసేస్తున్నాయి తెలుగు మీడియాలు. గ‌త కొద్దిరోజులుగా ప్ర‌ముఖ మీడియాలు చేస్తున్న హ‌డావుడి చూస్తుంటే.. థ‌ర్డ్ వేవ్ లో అస‌లైన ముప్పు ముంచుకొస్తుందా? అంటూ తెలుగు జ‌నం గంద‌ర‌గోళంలో ప‌డిపోతున్నారు. నిజానికి డెల్టా వేరియంట్ అన్న‌ది ఈ రోజు పుట్టుకొచ్చిన‌ది కాదు. మొద‌టి నుంచి ఉంది. అత్యంత వేగంగా చావు ముఖం చూసిన‌వారంతా డెల్టా వేరియెంట్ భారిన ప‌డిన‌వారే. అది కూడా జ‌బ్బు ముదిరిపోయాక తెలుసుకుంటేనే చ‌నిపోయారు. అంతేకాదు చాలామంది మాస్కుల్ని నిర్ల‌క్ష్యం చేసి లేదా క‌నీస నియ‌మాల్ని పాటించ‌కుండా తిరిగిన వారిని వైర‌స్ వెంటాడింది. ఇప్ప‌టికీ అదే పంథాలో ఆరుబ‌య‌ట య‌థేచ్ఛ‌గా తిరిగేస్తున్న వాళ్ల‌కు కొద‌వేమీ లేదు. అందువ‌ల్ల థ‌ర్డ్ వేవ్ ముప్పు ఉంటుంది.

అయితే అమెరికాలో డెల్టా వేరియంట్ వేగంగా విస్త‌రిస్తోంద‌ని దీనివ‌ల్ల మ‌ళ్లీ తెలుగు సినిమాకి ఇబ్బందే అంటూ ఒక పుకార్ షికార్ చేస్తోంది. అమెరికాలో ల‌క్ష‌ కోవిడ్ -19 కేసులు న‌మోద‌వ్వ‌డం వెన‌క డెల్టా వేరియెంట్ కార‌ణ‌మ‌ని దీనివ‌ల్ల ఇంటి లోపల ముసుగులు ధరించడం తిరిగి ప్రారంభించమని ..అమెరికాలో కోవిడ్ హాట్ స్పాట్స్ లో టీకాలు వేసిన వ్యక్తులను కోరడంతో గంద‌ర‌గోళం నెల‌కొంది. ఈ ఆకస్మిక కేసుల పెరుగుదల వారి సినిమాలను ప్లాన్ చేస్తున్న తెలుగు చిత్ర నిర్మాతలను భయాందోళనలకు గురిచేసింది. కొన్ని తెలుగు మీడియా సంస్థలు కూడా ఈ ఆకస్మిక ఉప్పెన గురించి క‌థ‌నాలు వండి వారుస్తూ టీఆర్పీ గేమ్ ఆడుతుంటే అది కూడా డౌట్ గా మారింది. పరిశ్రమకు మ‌ళ్లీ ఇబ్బందే అంటూ ప్ర‌చారం చేయ‌డంతో క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంది.

నిజానికి అమెరికాలో ఉన్న భార‌తీయులు ఇప్పుడే కాదు ఎప్పుడూ సుర‌క్షితంగానే ఉన్నారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉన్న‌ది మ‌న‌వాళ్లే. ఇప్పుడు అంద‌రూ టీకాలు వేయించుకుని నిగ‌ర్వంగా కోవిడ్ ప్రోటోకాల్ ని పాటిస్తున్నారు. కానీ స్వ‌చ్ఛ‌మైన అమెరిక‌న్లు ఇప్ప‌టికీ గ‌ర్వంగా మాస్కులు లేకుండా తిరిగేయ‌డం వ‌ల్ల‌నే అన్ని కేసులు న‌మోద‌య్యాయ‌ని విశ్లేషిస్తున్నారు. ``ఎర్ర తోలు మందం ఉన్నా కోవిడ్ ని త‌ట్టుకోవ‌డం క‌ష్టం.. న‌ల్ల తోలుకి రెసిస్టెన్స్ ఎక్కువ‌!`` అని కూడా విశ్లేషిస్తున్నారు. కోవిడ్ టీకావల్ల చాలా వ‌ర‌కూ ముప్పు తొల‌గినా గ‌ర్వంగా పొగ‌రుగా మాకు మాస్కులు అక్క‌ర్లేద‌ని తిరిగిన వారికే ముప్పు వాటిల్లుతోందిట‌. అలా చేసేది మ‌న ఎన్నారైలు కానేకాదు. అందువ‌ల్ల వారికి ముప్పు లేదు. టీకాల‌తో సుర‌క్షితంగా ఉన్న వీరంతా ఇక‌పై థియేట‌ర్ల‌కు రావొచ్చు.. అని విశ్లేషిస్తున్నారు. అమెరికాలో ఇప్ప‌టికే థియేట‌ర్లు తెరుచుకున్నాయి. సినిమాలు ఆడుతున్నాయి. జ‌నం చూస్తున్నారు. ఇక‌పైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌ల‌తో ఉంది. అలాగే ఓవ‌ర్సీస్ లో గ‌ల్ఫ్ సింగ‌పూర్ స‌హా చాలా దేశాలు సుర‌క్షితం. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లాంటి చోట్లా కేసులు పెద్ద‌గా లేక‌పోవ‌డం సినిమా మార్కెట్ కి క‌లిసొచ్చేదే.

వాళ్ల‌కే ముప్పు ఎక్కువ‌.. మ‌న‌కు కాదు!

మహమ్మారి ఎక్కువగా ఉన్న సమయంలో ఎర్ర‌తోలు జాతి మాస్క్ లు ధరించడానికి కూడా నిరాకరించారు. డెల్టా వేరియంట్ అక్కడ నాశనానికి కారణమైందని భార‌తీయ ఎన్నైరైలు విశ్లేషిస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో తెలుగు జనాభా చాలా తక్కువ. ఈ పెరుగుదల తెలుగు ప్రేక్షకుల యుఎస్ మార్కెట్ ను ప్రభావితం చేసే అవకాశం లేదు. తెలుగు జనాభా ప్రస్తుతం వేసవిని ఆస్వాదిస్తోంది. టీకాలు వేయించుకుని పార్టీలు సెలవులను ప్లాన్ చేస్తున్నారు. విహార‌యాత్ర‌ల్లో ఆస్వాధ‌న‌ల్లో మునిగి తేలుతున్నారు. ఒక‌వేళ కేసులు పెరిగినా కానీ టీకాలుతో సుర‌క్షితం అని న‌మ్ముతున్నారు. తెలుగు జ‌నం ఇక‌పైనా విరివిగా థియేటర్లకు వస్తారు. మంచి సినిమా వ‌స్తే వ‌దిలిపెట్టేందుకు సిద్ధంగా లేరు. కానీ తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో కొద్దిరోజుల పాటు సందిగ్ధ‌త నెల‌కొన‌నుంది. ఇక్క‌డ తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్టు ధ‌ర‌లు స‌హా ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌లున్నాయి. అవి వేగంగా ప‌రిష్కారం అయితే భారీ చిత్రాల రిలీజ్ లకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఆర్.ఆర్.ఆర్- ఆచార్య‌- కేజీఎఫ్ - పుష్ప లాంటి చిత్రాలు థియేట‌ర్ల‌కు వ‌స్తే ద‌ద్ద‌రిల్లిపోవాల్సిందేన‌ని భావిస్తున్నారు! మొద‌టి వేవ్ త‌ర్వాత కంబ్యాక్ అయిన‌ట్టే ఇప్పుడు రెండో వేవ్ త‌ర్వాతా తెలుగు ఇండ‌స్ట్రీ కంబ్యాక్ అవుతుంద‌నే అంతా హోప్ తో ఉన్నారు.


Tags:    

Similar News