గుస‌గుస‌: `హ‌ను-మాన్`గా మెగా హీరో న‌టిస్తారా?

Update: 2021-05-30 11:03 GMT
వైవిధ్య‌మైన కాన్సెప్టుల్ని ఎంచుకుని తెలుగు తెర‌పై ప్రయోగాలు చేసేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రిచే ద‌ర్శ‌కుడిగా ప్ర‌శాంత్ వ‌ర్మ పేరు ముందు వ‌రుస‌లో ఉంది. అత‌డు రూపొందించిన‌ అ!- క‌ల్కి-జాంబీ రెడ్డి .. ఇవి మూడూ విభిన్న‌మైన జోనర్ల‌లో తెర‌కెక్కిన‌వి. ఇప్పుడు అత‌డు హ‌ను-మాన్ అంటూ తొలి తెలుగు సూప‌ర్ హీరో సిరీస్ ని ప్ర‌క‌టించాడు. ఇది కేవ‌లం ఒక సినిమా కాదు.. భార‌తీయ పురాణేతిహాసాల్లోని హ‌నుమంతుని క‌థ స్ఫూర్తితో వ‌రుస చిత్రాల‌ను రూపొందిస్తున్నామ‌ని ముందే టైటిల్ ప్ర‌క‌ట‌న‌లోనే హింట్ కూడా ఇచ్చేశారు.

అయితే సూర్య పుత్రుడు తేజోవంతుడైన‌ హ‌ను-మాన్ అనే ఫిక్ష‌న‌ల్ పాత్ర‌లో న‌టించే హీరో ఎవ‌రు? అంటూ సోష‌ల్ మీడియాలో డిబేట్ సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ చిత్రంలో న‌టించే హీరోని ద‌ర్శ‌కుడు ఫైన‌ల్ చేయ‌లేదు.

స‌రికొత్త సినిమాటిక్ విశ్వం(అంటే కొన్ని సినిమాల సిరీస్) లోకి ప్ర‌వేశంచే ముందు సీట్ బెల్ట్ క‌ట్టుకోండి!! అంటూ కాన్ఫిడెంట్ గా ప్ర‌క‌టించిన ప్ర‌శాంత్ వ‌ర్మ న‌మ్మ‌కం చూస్తుంటే ఈ సినిమాకి ఓకే చెప్పే పెద్ద హీరో ఎవ‌రు? అన్న‌ది ఆసక్తిని క‌లిగిస్తోంది. కాన్సెప్ట్ పోస్ట‌ర్ తో ప్ర‌శాంత్ ఆస‌క్తిని పెంచాడు. ప్ర‌స్తుతానికి ఇంకా బౌండ్ స్క్రిప్ట్ రెడీ కావాల్సి ఉంది. త్వ‌ర‌లోనే హీరోల‌ను క‌లిసే వీలుంది.

హ‌ను-మాన్ ని చిన్న హీరోల‌తో తీస్తే అంత రేంజుకు చేర‌క‌పోవ‌చ్చు.  కానీ మెగా హీరో సాయి తేజ్ తో అయితే రేంజు వేరుగా ఉంటుంద‌ని సోష‌ల్ మీడియాల్లో చ‌ర్చ సాగుతోంది. ప్ర‌శాంత్ వ‌ర్మ అత‌డిని సంప్ర‌దిస్తున్నాడా లేదా? అన్న‌దానికి స‌మాచారం రావాల్సి ఉంది.

Tags:    

Similar News