మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
ఈ సినిమా ఫలితంతో అభిమానులు తీవ్ర అంతృప్తితో వున్నారు. దాదాపు బాస్ సినిమా కోసం రెండేళ్ల నిరీక్షణ వృధా అయిందంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా విషయంలో యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఈ సినిమా ఫలితంతో చిరుతో సినిమాలు నిర్మిస్తున్న చాలా మంది ప్రొడ్యూసర్స్ భయపడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో బాబి డైరెక్ట్ చేస్తున్న మూవీ కూడా వుంది. వైజాగ్ పోర్ట్ నేపథ్యంలో సాగే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. ఈ చిత్రానికి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ని ఫైనల్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని తన క్యారెక్టర్ పేరుని రివీల్ చేసి సినిమా టైటిల్ పై చిరు క్లారిటీ ఇచ్చేశారు.
ఇందులోని కీలక పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటించబోతున్నారు. సినిమాలో చిరుకు తమ్ముడిగా మాస్ రాజా పాత్ర వుంటుందని తెలిసింది. ఈ క్యారెక్టర్ కోసం రవితేజ అక్షరాలా 16 కోట్లు డిమాండ్ చేశారట. అయితే తాజా సినిమా ఫలితంతో చిత్ర బృందం తన ప్లాన్ ని మార్చుకుంటోందని చెబుతున్నారు. బడ్జెట్ రిస్క్ దృష్ట్యా ఈ సినిమా కు రవితేజ ప్లేస్ లో మారో హీరోని తీసుకోవాలని, తద్వారా బడ్జెట్ ని తగ్గించుకోవాలనే ఆలోచనలో మైత్రీ మూవీ మేకర్స్ , దర్శకుడు బాబి అలోచిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా వుంటే ఇప్పటికే ఈ మూవీ కోసం డేట్స్ ని ప్లాన్ చేసుకున్న రవితేజ త్వరలోనే సెట్స్ లోకి రావాలనుకుంటున్నాడట. కానీ మేకర్స్ మాత్రం ఆయనని పక్కన పెట్టి మరో హీరోతో వెళ్లాలనే ఆలోచనలో వున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏది నిజం? ఏది అబద్ధం అన్నది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిందే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. దర్శకుడు బాబీ మాత్రం రవితేజ స్థానంలో సూటయ్యే నటుడి కోసం అన్వేషణ మొదలు పెట్టారట.
భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరుకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో పాటు ప్రస్తుతం మలయాళ హిట్ ఫిల్మ్ 'లూసీఫర్' ఆధారంగా మోహన రాజా రూపొందిస్తున్న 'గాడ్ ఫాదర్', తమిళ హిట్ చిత్రం 'వేదాలం' ఆధారంగా మెహెర్ రమేష్ రూపొందిస్తున్న 'భోళా శంకర్' చిత్రానల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఇవి చిత్రీకరణ దశలో వున్నాయి. వీటిలో పాటు మరి కొన్ని చర్చల దశలో వున్నాయి.