టాలీవుడ్ సినిమా నిర్మాణం బంద్ పెట్టి నేటికి 16 రోజులు గడుస్తోంది. దీంతో ఎక్కడికక్కడ షూటింగ్ లు నిలిచిపోయాయి. నిర్మాతల మండలి-యాక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్ సమన్వయంతో సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పలు సమస్యలపై కమిటీలు వేసి వాటిని పూర్తి చేసినట్లు తెలుస్తోంది. హీరోల పారితోషికాల సమస్య ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో హీరోలంతా వీలైనంత త్వరగా తిరిగి షూటింగ్ లు ప్రారంభించాలని నిర్మాతలపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం.
మిగతా సమస్యలకి దాదాపు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఈరోజు మధ్నాహ్నం మరోసారి సమావేశమై తాజా పరిణామాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. కొన్ని ప్రధాన సమస్యలతో పాటు..ఓటీటీపైనా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సమ్మెను విరమించి యధావిధిగా షూటింగ్ లు నిర్వహించుకునేలా ప్రకటనే వచ్చే అవకాశం ఉందని వినిపిస్తుంది. అది ఈరోజు జరుగుతుందా? ఆగస్టు 22న విరమిస్తారా? అన్నది మాత్రం క్లారిటీ రాలేదు. ఆ ప్రకటన వచ్చిన తర్వాత గాని వచ్చింది అనుకోవాలి తప్ప అంతవరకూ సమ్మె కొనసాగింపుగానే భావించాలి. అయితే వీటితో ఎలాంటి సంబంధం లేకుండా బాలయ్య 107వ సినిమా షూటింగ్ ఈనెల 27 నుంచి టర్కీలో పున ప్రారంభం అవుతుంది.
ఔట్ డోర్ షూటింగ్ కాబట్టి బాలయ్య సినిమాకి వచ్చిన ఇబ్బంది లేదు. యాధావిధిగా షూటింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. దానికి సంబంధించి నిర్మాతల మండలి నుంచి చిత్ర నిర్మాతలు అనుమతి పత్రం కూడా పొందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నేచురల్ స్టార్ నాని 'దసరా' సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
నాని వీలైనంత త్వరగా సినిమా పూర్తిచేయాలని...షూటింగ్ చేసుకునేలా అనుమతులు పొందాలని కోరడంతో చిత్ర నిర్మాతలు.. మండలిని ఆశ్రయించి అనుమతి తీసుకున్నట్లు సమాచారం. శుక్రవారం నుంచి షూటింగ్ చేసుకునేలా 'దసరా' టీమ్ కి వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ షెడ్యూల్ కి సంబంధించి దసరా టీమ్ ఓ విలేజ్ సెట్ ని సిద్దం చేసి పెట్టింది.
రేపటి నుంచి షూటింగ్ అదే సెట్ లో జరగబోతుంది. నానితో పాటు ప్రధాన తారగణమంతా షూటింగ్ లోపాల్గొంటారని సమాచారం. మరోవైపు విశ్వక్ సేన్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ కూడా రేపటి నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. తన సినిమా విషయంలో వివాదం రావడంతో విశ్వక్ సేన్ సి.కళ్యాణ్ వద్ద తన సమ్యని విన్నవించుకోగా శుక్రవారం వరకూ ఆగాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే.
అలాగే మహేష్ 28వ సినిమా కూడా ఇదే నెలలో ప్రారంభం అవుతుందని వినిపిస్తుంది. వీటన్నింటిని బట్టి చూస్తే దాదాపు షూటింగ్ లు 18వ తేదీని నుంచి అన్ని తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని మెజార్టీ వర్గం భావిస్తుంది. బంద్ విషయంలో నేటి సమావేశం అనంతరం ఓ క్లారిటీ వస్తుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.