స‌మంత 'య‌శోద‌'కు ప్ర‌భాస్ టెన్ష‌న్ ప‌ట్టుకుందా?

Update: 2022-11-07 07:30 GMT
యశోద.. సమంత టైటిల్ పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇది. శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు హరి- హరీష్‌ ద్వయం దర్శకత్వం వ‌హించారు. సరోగసి నేపథ్యంలో ఇంతవరకు ఎవరు చూపించని ఓ సరికొత్త పాయింట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందించారు.

ఇందులో సమంత ప్రెగ్నెంట్ లేడీ గా కనిపించబోతోంది. అలాగే ఉన్ని ముకుంద‌న్‌, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. దాదాపు 40 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన ఈ చిత్రం నవంబర్ 11న తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధప‌డుతున్న కార‌ణంగా ఆమె ప్రమోషన్స్ కు దూరంగా ఉంటుంది. అయితే వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుంద‌న్ తో స‌హా దర్శకనిర్మాతలు జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. ఇప్పుడు ఈ సినిమాకు ప్రభాస్‌ టెన్షన్ పట్టుకుందనే టాక్ న‌డుస్తోంది.

అందుకు కారణం లేకపోలేదు. నవంబర్ 11న బాక్సాఫీస్ వద్ద సమంతతో పోటీ పడేందుకు ప్రభాస్ దిగుతున్నాడు. అసలు విషయం ఏంటంటే.. ఇటీవల టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ బాగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురి స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి రికార్డులను సృష్టించాయి. ఇప్పుడు ప్రభాస్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన 'వర్షం' సినిమాను మరోసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నవంబర్ 11 నాటికి ప్రభాస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇర‌వై ఏళ్లు పూర్తి కాబోతోంది. ఈ సందర్భంగా వర్షం సినిమాను 4కె ప్రింట్ తో భారీ ఎత్తున రీ రిలీజ్ చేయబోతున్నారట. దీంతో ఆ రోజు ప్రభాస్ అభిమానులంద‌రూ 'వర్షం' వైపే మొగ్గు చూపుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే బీ, సీ సెంటర్ ఆడియన్స్ ను కూడా ప్రభాస్ ఎట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉంది.

ఈ నేపథ్యంలోనే ప్రభాస్ 'వర్షం' సినిమా 'యశోద' ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమే ఇప్పుడు యశోద మేకర్స్ ను కాస్త కలవరపాటుకు గురి చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News