కొత్తగా పెద్ద సినిమాలొస్తున్నాయ్.. మరి వార్నర్ స్పూఫ్ లుంటాయా?

Update: 2022-02-18 00:30 GMT
రాబోయే రోజుల్లో ఆచార్య, వకీల్ సాబ్, సర్కారు వారి పాట, అన్నిటికి మించి ఆర్ఆర్ఆర్.. ఇలా ఒకటేమిటి అనేక పెద్ద సినిమాలొస్తున్నాయి. ఏపీ ప్రభుత్వంతో చర్చలు కొలిక్కిరావడం, కొవిడ్ మూడో వేవ్ కూడా తగ్గడంతో సినిమాల విడుదలకు అడ్డంకులేమీ లేవు.

దీంతో రిలీజ్ ప్రయత్నాలు జోరందుకోవడం ఖాయం. కొవిడ్ మూడో వేవ్ తగ్గుదలను చూసుకునే ఇటీవల సినిమా అగ్ర హీరోలు,దర్శకులు ఏపీ సీఎం జగన్ ను కలిశారు. కాగా, అంతా కొలిక్కి వచ్చి అడ్డంకులు లేకుంటే ఈ వేసవిలో సందడే సందడి. అంతా బాగానే ఉన్నా,  ఒక్కటి మాత్ర మిస్ అవుతామేమోనని అనిపిస్తోంది. అదే.. ఆస్ట్రేలియా ఓపెనర్ ,డాషింగ్ బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ స్పూఫ్ లు.

ఎందుకలా?

డేవిడ్ వార్నర్ ఎనిమిదేళ్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యుడు. ఇందులో 2016 లో కప్ గెలవడంలోనూ అతడిది కీలక పాత్ర. ఓ దశలో సి గ్రేడ్ జట్టుగా మారిపోయిన హైదరాబాద్ ను వార్నర్ తన సారథ్య సామర్థ్యంతో పైకిలేపాడు. ఓసారి విజేతగా నిలపడమే కాదు.. బలమైన జట్టును తయారు చేశాడు. ఓపెనర్ గా అతడు భారీగా సాధించే పరుగులు జట్టుకు పోరాడే స్కోరునిచ్చేవి.

అలాంటిది వార్నర్ 2018లో బాల్ ట్యాంపరింగ్ కారణంగా ఏడాది నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. వాస్తవానికి అప్పటికి వార్నర్ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. సన్ రైజర్స్ కూడా మాంచి ఊపుమీదుంది. కానీ, అనూహ్యంగా వచ్చిన బాల్ ట్యాంపరింగ్ అతడి కెరీర్ ను మసకబార్చింది. 2018 సీజన్ కు దూరమైన వార్నర్ 2019 సీజన్ కు జట్టులోకి వచ్చాడు. అయితే, కెప్టెన్సీ మాత్రం చేపట్టలేదు. ఇదలా ఉంచితే.. 2021 సీజన్ లో వార్నర్ దారుణంగా విఫలమయ్యాడు. అటు అంతర్జాతీయ క్రికెట్ లోనూ అతడి ఫామ్ ఏమంత గొప్పగా లేదు.

ఈ నేపథ్యంలో సన్ రైజర్స్అతడిని తుది జట్టు నుంచి తప్పించింది. ఆఖరికి వార్నర్ మైదానంలోని ఆటగాళ్లకు డ్రింక్స్ ఇవ్వడం అభిమానులందరినీ కలచివేసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. చివరకు ఈ ఏడాది రిటైనర్ల జాబితాలోనూ అతడి పేరు లేదు. ముగ్గురి నే రిటైన్ చేసుకున్న సన్ రైజర్స్ వార్నర్ ను విస్మరించింది. అంటే వార్నర్ ఇకపై హైదరాబాద్ జట్టు సభ్యుడు కాదు. మూడు రోజుల క్రితం జరిగిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ.7కోట్లకు కొనుగోలు చేసింది.

ఓ విధంగా చెప్పాలంటే ధర తగ్గినా.. ఇది ప్రస్తుతానికి మంచి ధరే.అనుకరిస్తూ.. అలరిస్తూ..ఆటతో పాటు వార్నర్ తెలుగు ప్రజలకు పాపులర్ సినాల డైలాగ్ స్పూఫ్ ల ద్వారా మరింత దగ్గరయ్యాడు. టిక్ టాక్, ఇన్ స్టా రీల్స్ గ్రాం లో  లో పలువురు హీరోల డైలాగ్ లను అనుకరిస్తూ ఆకట్టుకునేవాడు. దీంతోపాటు హీరోల డ్యాన్స్ మూమెంట్స్ ను కూడా చేస్తూ అలరించాండు. కొన్ని స్కిట్ లలో వార్నర్ భార్య కూడా ఉండడం విశేషం. ఓ దశలో దర్శకుడు వెంకీ కుడుముల వార్నర్ కు తెలుగు సినిమాలను ప్రమోట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపాడంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఢిల్లీకి మారాడుగా..? హిందీ సినిమాలపై చేస్తాడేమో?ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడిగా మారిన వార్నర్ నుంచి తెలుగు సినిమా డైలాగ్ లు, డ్యాన్స్ బిట్ ల వీడియోలు రావేమో. ఢిల్లీకి మారిన వార్నర్ చూపు బాలీవుడ్ సినిమాలపై పడొచ్చు. బాలీవుడ్ లోనూ ఇటీవల భిన్న సినిమాలు వస్తున్న నేపథ్యంలో వార్నర్ కు  వీడియోలు చేసేందుకు మంచి అవకాశమే ఉంది. కొంతమంది అభిమానులు మాత్రం వార్నర్ .. హిందీలోకి డబ్ అయిన తెలుగు సినిమాలను చూసి సీన్స్, డైలాగ్ లను రీల్స్ చేస్తాడని అంటున్నారు. చూద్దాం .. అసలు ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ ఏం చేస్తాడో.??
Tags:    

Similar News