సౌత్ సినీపరిశ్రమల్లో అగ్ర నాయికగా సత్తా చాటింది సమంత. ఒడిదుడుకులెన్నిటినో అధిగమించి తనదైన మార్క్ ప్రణాళికలతో దూసుకుపోతోంది. ఇక ఇటీవలి కాలంలో సమంత ఎక్కువ సమయాన్ని ముంబైలో గడుపుతుండడం అభిమానుల్లో రకరకాల సందిగ్ధతలకు కారణమవుతోంది.
సెలూనికి వెళ్లినా.. లంచ్ డేట్ కి వెళ్లినా .. లేదా ఏదైనా పార్టీకి వెళ్లినా కానీ పూర్తిగా ముంబై లోకల్ నుంచే సమంత రిపోర్ట్ చేస్తుంటే ఇక పూర్తిగా బాలీవుడ్ లో లాకైపోతోందా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి ముంబై నుంచే సమంత ప్రకటన వెలువడింది.
అందాల సమంతా తన సహనటి వరలక్ష్మి శరత్ కుమార్ .. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోనతో కలిసి లంచ్ డేట్ కి బయలుదేరిన విషయం వైరల్ గా మారింది. వరలక్ష్మి ఈ అద్భుతమైన లంచ్ ఔటింగ్ నుండి కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ముగ్గురి కలయిక వెనక బ్రహ్మరహస్యం దాగి ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ ఫోటోగ్రాఫ్ లో సామ్ తన కొత్త కేశాలంకరణను ప్రదర్శించింది. ఇది ముంబైలో ఒక లగ్జరీ సెలూన్ డిజైన్ చేయించిన హెయిర్ స్టైల్. రిజల్ట్ బాగానే ఉంది. సామ్ ఈ కొత్త లుక్ లో ఎంతో అందంగా కనిపిస్తోంది.
ఈ ఫోటోలో వరూ చారల చొక్కాలో టామ్ బోయ్ లా కనిపిస్తోంది. వరలక్ష్మి తన క్యాప్షణ్ లో ఇలా రాసింది. ``సామ్ లవ్ లీగా లేదూ?? ఖచ్చితంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. BTW ఈ పోస్ట్ చేసినందుకు నాకు లంచ్ ఆఫర్ చేసింది`` అని వ్యాఖ్యానం జోడించింది. అదే విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో రీపోస్ట్ చేస్తూ.. సామ్ ఇలా రాసింది. ``ఆ చివరి పంక్తిని చదవలేకపోతున్నాను...మళ్లీ అదేమిటీ`` అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సమంత తదుపరి విఘ్నేష్ శివన్ `కాతు వాకులా రెండు కాదల్`లో కనిపించనుంది. రోమ్-కామ్ ఫిబ్రవరి 11న విడుదల కానుంది. అలాగే గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం కూడా విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం వరలక్ష్మితో కలిసి యశోదతో బిజీగా ఉంది. హాలీవుడ్ చిత్రం అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ కు సంతకం చేసింది. ఈ చిత్రం ఆగస్ట్ 2022లో ప్రారంభం కానుంది. సమంత తదుపరి తాప్సీ నిర్మించే ఓ రెండు చిత్రాల్లో నటిస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ తర్వాత రాజ్ అండ్ డీకే లతో మరోసారి వెబ్ సిరీస్ కోసం పని చేయనుందని సమాచారం. మరోవైపు సామ్ క్లోజ్ ఫ్రెండ్ వరలక్ష్మి ఇటీవలి కాలంలో వరుస చిత్రాల్లో లేడీ విలన్ గా నటించి మెప్పిస్తున్న సంగతి తెలిసిందే.