ఫస్ట్ లుక్: 'విన్నర్' వచ్చాడు

Update: 2016-10-15 04:12 GMT
మొన్నామధ్యన దసరా పండుగ పురస్కరించుకుని.. వరుసగా శతమానం భవతి - ధృవా - గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాల టీజర్లు విడుదలయ్యాయి. వారి మధ్యలో పండుగనాడే తనుకూడా హడావుడి ఎందుకులే అనుకున్నాడేమో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. ఇప్పుడు మనోడు తన పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ తో వచ్చాడు.

ప్రస్తుతం గోపిచంద్ మలినేని డైరక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు సాయిధరమ్. అందరూ అనుకున్నట్లే ఈ సినిమాకు ''విన్నర్‌'' అనే టైటిల్ పెట్టారు. అయితే సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామానా లేకపోతే ఇంకోటి ఏదైనా కథా అనే విషయం మాత్రం తెలియదు. అప్పట్లో అయితే సాయిధరమ్ మాత్రం ఒక ఫ్యాషన్ మ్యాగజైన్ ఎడిటర్ గా ఈ సినిమాలో కనిపిస్తాను అన్నాడు. ఏదేమైనా కూడా.. ఫస్ట్ లుక్ అయితే యావరేజ్ గా ఉందనే చెప్పాలి. సాయిధరమ్ హెయిర్ స్టయిల్ ఒక్కటే మారింది కాని.. పోస్టర్ డిజైన్ మాత్రం పరమ రొటీన్ గా ఉంది.

ఇకపోతే ఈ సినిమాలో మెగా మేనల్లుడి సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. 'తిక్క' సినిమాతో డిజప్పాయింట్ చేసిన సాయిధరమ్.. ఈ సినిమాతో గాట్టిగా హిట్టు కొట్టేస్తాడని ఆశిద్దాం.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News