బిగ్ బాస్ సీజన్ 4 కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న గంగవ్వకు కరోనా పరీక్షలు నిర్వహించారంటూ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆమె స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా అనుమానం లేకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో కరోనా నిర్థారణ పరీక్షలు చేయించారట. బిగ్ బాస్ టెక్నీషియన్స్ కు కొంత మందికి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన కారణంగా హౌస్ లో ఉన్న అందరికి కూడా పరీక్షలు చేయిస్తే బాగుంటుందని భావించాటర. కాని గంగవ్వ మాత్రమే అనారోగ్యంతో ఉన్నారని మొదట ఆమెకు మాత్రమే చేయించాలని నిర్ణయించారట.
ఆమె పరీక్ష ఫలితాన్ని బట్టి మిగిలిన వారికి కూడా పరీక్ష నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 కరోనా టెన్షన్ వల్ల ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. చాలా జాగ్రత్తలు తీసుకుని షో నిర్వహిస్తున్నారు. కంటెస్టెంట్స్ అంతా కూడా రెండు వారాల పాటు క్వారెంటైన్ లో ఉండి ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చారు. కనుక నూటికి నూరు శాంత షో లో ఉన్న వారికి కరోనా సోకే అవకాశం లేదు అంటున్నారు. అయినా కూడా గంగవ్వ వయసును దృష్టిలో పెట్టుకుని ఆమె ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత బిగ్ బాస్ నిర్వాహకులకు ఉంది కనుక ఆమెకు కరోనా పరీక్షలు రెగ్యులర్ గా చేయించాలని అనుకుంటున్నారట. ఆ ఉద్దేశ్యంతోనే గంగవ్వకు కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. ఆ రిపోర్ట్ విషయమై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.