థమన్‌ ఇచ్చిన సలహాతో 'గాడ్‌ ఫాదర్‌' ఆగిపోయే పరిస్థితి వచ్చిందట!

Update: 2022-10-14 12:30 GMT
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గాడ్ ఫాదర్ అనగానే హాలీవుడ్ చిత్రం గుర్తుకు వస్తుంది, హాలీవుడ్ లో గాడ్ ఫాదర్ సిరీస్ లో చాలా సినిమాలు సిరిస్ లు వచ్చిన విషయం తెలిసిందే.

అంతే కాకుండా గాడ్ ఫాదర్ టైటిల్ కి ట్రేడ్ మార్క్ ఉండడం వల్ల చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా విడుదల సమయంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ నిర్మాత ఎన్వి ప్రసాద్ చెప్పుకొచ్చాడు.

తాజాగా సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా నిర్మాత మాట్లాడుతూ సినిమా టైటిల్ గురించి చర్చ జరుగుతున్న సమయంలో దర్శకుడు మోహన్ రాజా సర్వాంతర్యామి అనే టైటిల్ ని అనుకున్నాడు, కానీ సంగీత దర్శకుడు తమన్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి ఈ కథకు గాడ్ ఫాదర్ అయితే బాగుంటుందని సలహా ఇచ్చాడు.

అంతే కాకుండా చిరంజీవి గారికి G అనే అక్షరం బాగా కలిసి వస్తుందని కూడా చెప్పడంతో గాడ్ ఫాదర్ సినిమా టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది. ఎప్పుడైతే టైటిల్ ని ప్రకటించామో.. అప్పటి నుంచి లీగల్ సమస్యలు మొదలయ్యాయి.

తిరుపతిలో ఉన్న మా ఇంటి వద్దకి కూడా నోటీసులు వచ్చాయంటే తాము ఎంతగా చట్టపరమైన సమస్యలను ఎదుర్కొన్నామో అర్థం చేసుకోవచ్చు. నాతో పాటు చిరంజీవి గారు మరో నిర్మాత చౌదరి గారు కూడా ఈ టైటిల్ విషయమై లీగల్ నోటీసులు అందుకున్నాం.

ఢిల్లీ నుంచి నోటీసులు వచ్చాయని చెప్పారు. లీగల్ నోటీసులు వచ్చిన నేపథ్యంలో సినిమా టైటిల్ ని తెలుగులో చిరంజీవి గాడ్ ఫాదర్ గా హిందీలో మెగాస్టార్ గాడ్ ఫాదర్ గా విడుదల చేసినట్లు చెప్పుకొచ్చాను.

తమన్‌ సలహా ఇచ్చి వెళ్లి పోయాడు, మేము మాత్రం చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ సరదాగా నిర్మాత ఎన్వీ ప్రసాద్ తాజా ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. ఈ విషయమై ముందు ముందు ఎలాంటి సమస్యలు రాకుండా చర్చలు జరిగాయని, ఒప్పందం జరిగిందని అన్నాడు.  

ఒకానొక సమయంలో సినిమా ఆగిపోయే పరిస్థితి వచ్చిందని.. న్యాయ నిపుణులు మరియు ప్రముఖులతో మాట్లాడించడం వల్ల టైటిల్ విషయంలో మాకు కాస్త ఊరట దక్కిందని నిర్మాత పేర్కొన్నాడు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News