అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నారు. మంచి కంటెంట్ ఉంటే చాలు, ఆయన కొత్త దర్శకులను .. కొత్త హీరోలను తన బ్యానర్ ద్వారా ప్రోత్సహిస్తున్నారు. తాజాగా ఆయన మారుతి దర్శకత్వంలో 'పక్కా కమర్షియల్' సినిమాను నిర్మించారు. అయితే ఆ సినిమాకంటే ముందుగా మారుతి, చాలా తక్కువ బడ్జెట్ లో .. తక్కువ సమయంలో 'మంచి రోజులు వచ్చాయి' అనే సినిమా చేశాడు. సంతోష్ శోభన్ - మెహ్రీన్ జంటగా నటించిన ఈ సినిమా వచ్చేనెల 4వ తేదీన విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్నరాత్రి చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేదికపై అల్లు అరవింద్ మాట్లాడుతూ .. "మంచి రోజులు వచ్చాయి' .. వస్తున్నాయి అని ఈ మధ్య విడుదలైన ఒక మూడు సినిమాల కలెక్షన్స్ చూస్తే మనకు అర్థమవుతోంది. సినిమా వాళ్లకి మంచి రోజులు రావడమంటే, జనం థియేటర్లకు రావడమే. జనం థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తే, మాకు మంచి రోజులు వచ్చినట్టు. దయచేసి సినిమాలను తెరపై చూసేలా చేయమని, 'ఆహా' ఓనర్ నైన నేనే అడుగుతున్నాను.
ఎందుకంటే ఓటీటీ కోసం సినిమాలు చేయడం లేదు మనం. ఈ సినిమాలు ముందుగా తెరపై చూసి, ఆ తరువాత ఓటీటీకి రావడానికి చేసినవి. ఒక ఓటీటీ ఓనరునై ఉండి కూడా సినిమాను తెరపైనే చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సినిమా విషయానికి వస్తే, మారుతి నాకు చాలా కాలంగా తెలుసు. బన్నీ ఫ్రెండ్ గా మా ఇంటికి వచ్చి వెళ్లే రోజుల నుంచి తెలుసు. ఆయనను మా ఇంట్లో కుర్రాడిలానే చూస్తుంటాము. ఆయన దగ్గర ఒక పెక్యులర్ లీడర్ షిప్ ఉంది.
ఎవరినీ నొప్పించడు .. తనపని తాను చేసేస్తాడు .. తనకి కావలసినదేదో రాబట్టేస్తాడు. అలాంటి లీడర్ షిప్ స్కిల్స్ బోలెడు ఉన్నాయి. ఆయన నా దగ్గరికి వస్తుంటేనే నాతో ఏదో పనుండి వస్తున్నాడు .. నన్ను ఒప్పించేస్తాడు అని నాకు తెలుసు. వచ్చేసి మాట్లాడతాడు .. ఒప్పించేసుకుని వెళ్లిపోతాడు. అతనితో నాలుగు సినిమాలు చేశాను .. నాలుగో సినిమా జరుగుతోంది. ఎంటర్టైన్ మెంట్ లోపల మంచి మెసేజ్ ను పెట్టి, తమలపాకుల మాదిరిగా చుట్టేసి మన నోట్లోకి తోసేస్తాడు .. అది మనకి తెలియదు. అంత స్కిల్స్ ఉన్న దర్శకుడాయన.
ఇక సంతోష్ విషయానికి వస్తే 'పేపర్ బాయ్' సినిమా సమయంలోనే స్టేజ్ పై చెప్పాను. గీతా ఆర్ట్స్ లో సినిమా చేయమని నిన్ను అప్పుడే అడిగాను. సంతోష్ టాలెంటెడ్ గై .. ఆ విషయం నాకు ఇంతకుముందే తెలుసు. మీ ఫాదర్ పడిన కష్టం .. వాటిని గురించి వదిలేసేయ్. ఎన్నున్నా టాలెంట్ లేకపోతే ఇండస్ట్రీ ఎవరినీ ఎత్తుకోదు. హండ్రెడ్ పర్సెంట్ నీకు టాలెంట్ ఉంది కాబట్టి, ఇండస్ట్రీ ఎత్తుకుంది. మిగతా అంశాలన్నీ కలిసొస్తాయి. ఇక మెహ్రీన్ విషయానికి వస్తే ఆమె ఈ పాత్రను ఎంతోబాగా చేసింది .. కీపిటప్ .." అంటూ ప్రోత్సహించారు.
మారుతి స్నేహితుడిగా .. మా హీరోగా గోపి ఇక్కడికి విచ్చేయడం మా అందరికీ ఆనందం , అందుకు నేను ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను. అనూప్ ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. పెద్ద పెద్ద హీరోలు ముందుకు వచ్చి .. చిన్నచిన్న సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఇండస్ట్రీకి ఎంతో అవసరం కూడా. మంచి రోజులు వచ్చాయనేది మొన్న ప్రూవ్ అయింది .. మళ్లీ ప్రూవ్ కాబోతోంది. కరోనా థర్డ్ వేవ్ లేదని నమ్ముతూ .. ముందున్నవన్నీ మంచి రోజులే అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను" అంటూ ముగించారు.