మనుషులు చూసే కోణాన్ని బట్టి పరిస్థితులు కనిపిస్తుంటాయని కొందరు చెప్తుంటే...వినేందుకు ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా...అది నిజమే అనే సందర్భం మనకు ఒకటీ రెండు సార్లు కలగకమానదు. ఓ సదుద్దేశంతో చేసిన పని పలువురికి చిత్రంగా నచ్చకుండా మారడంతో వివాదం తలెత్తి కోర్టు గుమ్మం ఎక్కింది. అయితే కోర్టు ఆమెకు మద్దతిచ్చింది. పసి పిల్లలకు చనుబాలు ఇచ్చేందుకు తల్లులు మొహమాటం వీడాలనే ఉద్దేశంతో కేరళకు చెందిన ‘గృహలక్ష్మి’ మేగజీన్ చేసిన ప్రయత్నం మంచిదేనని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. తల్లి బిడ్డ ఆకలి తీర్చుతున్న కవర్ ఫోటోపై అభ్యంతరాలు లేవని తెలిపింది.
ప్రముఖ మలయాళి నటి - రచయిత - మోడల్ గిలు జోసెఫ్.. ఓ మేగజిన్ కవర్ పేజీ కోసం ఓ బిడ్డకు పాలిస్తూ ఫొటోలకు ఫోజివ్వడం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. ఓ మలయాళీ మ్యాగజైన్ ముఖచిత్రం పై బిడ్డకు పాలుపట్టిస్తున్న మోడల్ ఫొటోను ప్రచురించటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గృహలక్ష్మి అనే మలయాళీ మ్యాగజైన్ ముఖచిత్రంపై గిలు జోసెఫ్ అనే మోడల్ బిడ్డకు పాలిస్తున్న ఫొ టో ప్రచురించారు. ఈ నెల ఒకటో తేదీన వచ్చిన గృహలక్ష్మి సంచికపై `మేం బిడ్డలకు పాలివ్వాల్సి ఉంది. దయచేసి మమ్మల్ని పొంచిపొంచి చూడొద్దని కేరళకు చెప్పండి తల్లులారా!` అనే టైటిల్‌తో కవర్ ఫొటో ప్రచురించారు. అయితే ఈ ఫొటో అసభ్యకరంగా ఉన్నదని పేర్కొంటూ కేరళ హైకోర్టు, కేరళ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌లోనూ కేసులు వేశారు. సోషల్ మీడియాలో పలువురు దీన్ని ప్రశంసించగా, మరికొందరు దీనికి వ్యతిరేకంగా స్పందించారు. ఫొటో అసభ్యంగా ఉందని, ఇది మహిళల అసభ్య ప్రాతినిధ్య (నిషేధ) చట్టం 1986లోని సెక్షన్ 3 - 4లను ఉల్లంఘించిందని ప్రచురణకర్తలు - మోడల్ పై న్యాయవాది వినోద్ మాథ్యూ కొల్లం న్యాయస్థానంలో కేసువేశారు.
దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ భారతీయ సంప్రదాయంలో మానవ దేహానికి ఎంతో ప్రాధాన్యం ఉందనీ, ప్రాచీన కళలు, బొమ్మల్లో మానవ దేహ సౌందర్యాన్ని వర్ణించారని తెలిపింది. అయితే, చూసే కళ్లను బట్టి దాని అంతరార్థం బోధ పడుతుందని పేర్కొంది. అజంతా చిత్రాలు, రవివర్మ పేయింటింగ్స్‌లో అశ్లీలతను చూసేవారు కొందరైతే, అద్భుత కళా సౌందర్యాన్ని చూసేవారు మరి కొందరని వివరించింది. ఈ కవర్ ఫోటోపై అభ్యంతరాలు లేవని తెలిపింది.
ఈ వివాదంపై దుబాయ్‌కు చెందిన మలయాళీ మోడల్ గిలు జోసెఫ్ ఓ వీడియోలో స్పందిస్తూ.. బహిరంగంగా తల్లిపాలు పట్టడంపై గృహలక్ష్మి జరుపుతున్న ప్రచారంలో ఇది ఓ భాగం. ఇది వాస్తవ సమస్య. ప్రస్తుతం సమాజంలో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తమ బిడ్డకు పాలుపట్టే వాతావరణం కల్పించలేదు. బిడ్డకు పాలుఇవ్వడం అనేది తల్లి హక్కు. దీని గురించి ఎవరూ భయపడాల్సిన లేదా సిగ్గుపడాల్సిన అవసరంలేదు. ఇలాంటి ఫోజు ఇచ్చినందుకు నేను ఎంతో గర్వంగా ఫీలవ్వుతున్నా. అని చెప్పారు. బిడ్డకు పాలిస్తూ తాను ఫొటోకు ఫోజిస్తున్నా అని మా అమ్మా, చెల్లికి చెప్పాను. ఇందుకు వారు అస్సలు ఒప్పుకోలేదు. అయితే, ఈ చిత్రం ద్వారా మహిళలు - అమ్మలు - భార్యలకు నేను ఒక విషయం స్పష్టం చేయాలని అనుకుంటున్నా. మీ పిల్లలకు ధైర్యంగా పాలివ్వండి. అది ఓ అపూర్వ అవకాశం. సిగ్గుపడొద్దు అని జోసెఫ్ తెలిపింది.