మన దేశంలో హాలీవుడ్ యాక్షన్ సినిమాలుకు మంచి గిరాకీ ఉంటుంది. కిందటి వారం మన దేశం బాక్సాఫీస్ వద్ద అలాగే ప్రపంచ బాక్స్ ఆఫీసు వద్ద ఒక వుమన్ యాక్షన్ ఫిల్మ్ వచ్చి సంచలనం సృష్టించింది. హాలీవుడ్ ఫిల్మ్ ‘వండర్ వుమన్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు వర్షం కురిపిస్తుంది. రికార్డు స్థాయిలో ఎవరూ ఊహించని విదంగా కలెక్షన్లు రాబడుతుంది. 'ది మమ్మీ' సినిమాను కూడా పక్కకు నెట్టి ముందుకు వచ్చి బాక్స్ ఆఫీసు వద్ద మొదటి స్థానంలో నిలబడింది.
తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 223 మిలియన్ డాలర్లు (రూ. 1435 కోట్లు) వసూలు చేసిన ఈ సినిమా వారం పూర్తి అయ్యేపాటికి 420 మిలియన్ డాలర్లు (రూ. 2700) వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. క్రేజ్ ఉన్న స్టార్లు లేకపోయినా, లేడీ డైరెక్టర్ డైరెక్ట్ చేసిన ఒక హీరోయిన్ ఓరియంటెడ్ యాక్షన్ సినిమాకు ఈ స్థాయి కలెక్షన్లు రావడం అందరికీ నమ్మలేని నిజంగా ఉంది. 2003లో వచ్చిన ‘మాన్ స్టర్’ తర్వాత ప్యాటీ జెన్కిన్స్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో టైటిల్ రోల్ ను 32 ఏళ్ళ ఇజ్రాయెలి నటీమణి గాల్ గడోట్ పోషించింది. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సినిమాల ద్వారా సినీ ప్రపంచానికి సుపరిచితురాలైన ఈ అమ్మడు ‘బ్యాట్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్’ సినిమాలో తొలిసారిగా వండర్ వుమన్ డయానా ప్రిన్స్ పాత్రను పోషించింది. మరో హాలీవుడ్ సినిమా ‘జస్టిస్ లీగ్’లోనూ ఇదే పాత్రలో నటించబోతోంది.
మొత్తానికి ‘వండర్ వుమన్’ దెబ్బకు హాలీవుడ్ హడలిపోతుంది. ప్రియాంకా చోప్రా నటించిన ‘బేవాచ్’ బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. టామ్ క్రూయిస్ వంటి సూపర్‌స్టార్ నటించిన ‘ద మమ్మీ’ సైతం రెండో స్థానానికి పడిపోయింది అంటే ఇది ఇప్పుడు జరిగిన పెద్ద వండర్ అనే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/