అందం కోసం వర్కౌట్స్‌, డైటింగ్‌ మాత్రమే కాదు ఇంజక్షన్స్‌ కూడా..!

Update: 2022-06-11 10:36 GMT
హీరోయిన్స్‌ అందంగా కనిపించడం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. జిమ్ లో గంటల తరబడి వర్కౌట్స్‌ చేస్తూ.. ఏది పడితే అది తినకుండా ఎంతగానో డైటింగ్ మెయింటెన్‌ చేస్తూ తమ ఫిజిక్ ను కాపాడుకుంటూ ఉంటారు. అందం గా కనిపించడం కోసం ముఖానికి ఎన్నో రకాల కెమికల్స్ తో కూడిన క్రీమ్ లు ఉపయోగిస్తారు.

ఈ కష్టాలు మాత్రమే కాకుండా కొందరు హీరోయిన్స్ ఆపరేషన్ ను కూడా చేయించుకుని అందంగా కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి హీరోయిన్స్ కొందరు సక్సెస్ అవ్వగా కొందరు సూపర్ స్టార్స్ కూడా అయిన విషయం తెల్సిందే. హీరోయిన్స్ గా రాణించాలంటే ప్రతిభతో పాటు అందం కూడా చాలా కీలకం.

అందుకే అందంగా కనిపించడం కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈషా గుప్త ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌ అయ్యింది. కెరీర్‌ ఆరంభంలో చాలా మంది అందం విషయంలో భయాందోళనకు గురి చేసి వారం వారం అందం కోసం ఇంజక్షన్‌ తీసుకునేలా చేశారట.

అందంగా కనిపించడం కోసం తప్పనిసరిగా ఇంజక్షన్ తీసుకోవాలని.. లేదంటే స్కిన్ చెడిపోయి తక్కువ కాలంకే ఇండస్ట్రీ నుండి వెళ్లి పోవాల్సి వస్తుందని భయపెట్టారట. దాంతో 9 వేల రూపాయల ఇంజక్షన్‌ ను అప్పట్లోనే తాను రెగ్యులర్‌ గా తీసుకోవాల్సి వచ్చింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఇలా అందం కోసం అడ్డదారుల్లో ప్రయత్నాలు చేసి చివరకు అనారోగ్యం పాలు అవుతున్నారు అంటూ ఈషా గుప్త ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రస్తుతం ఈషా గుప్త వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇంకా ఎంత మంది అలాంటి పనులు చేశారు.. ఇప్పుడు ఎలాంటి పద్దతులు పాటిస్తున్నారు అంటూ ఆరా తీస్తున్నారు.
Tags:    

Similar News