ఫస్ట్ లుక్: ఇంటెన్స్ లుక్ లో రౌడీగారు!

Update: 2019-09-20 11:30 GMT
యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రీసెంట్ గానే టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు.  తాజాగా నిర్మాతలు ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ ఒక ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు.  పొడవు జుట్టు.. మాసిన గడ్డం మొహం పైన రక్తపు మరకలతో కాస్త వయొలెంట్ గా ఉన్నాడు.  పై బటన్లు వదిలేసిన షర్టు.. చేతిలో సిగరెట్ తో... నోట్లో నుంచి పొగ వదులుతూ సీరియస్ లుక్ ఇచ్చాడు.  ఇంటెన్స్ క్యారెక్టర్లు చేయడంలో విజయ్ ఇప్పటికే తన సత్తాను నిరూపించుకున్నాడు. సో.. మరోసారి అలాంటి ఇంటెన్స్ ఎమోషన్స్ తో ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. సినిమా టైటిల్ 'వరల్డ్ ఫేమస్ లవర్' అని ఉంది.. ఫస్ట్ లుక్ లో విజయ్ ని చూస్తే ప్రేమలో విఫలమైనవాడిలా.. ఓ భగ్న ప్రేమికుడిలా కనిపిస్తున్నాడు.  మరి ఈ ఎమోషన్ వెనుక ఏముందో తెలియాలంటే టీజర్.. ట్రైలర్ వచ్చేవరకూ ప్రేక్షకులు వేచి చూడకతప్పదు.

దర్శకుడు క్రాంతి మాధవ్ సాఫ్ట్ ఫిలిమ్స్.. మంచి ఫీల్ ఉన్న సినిమాలు తీస్తాడని పేరుంది. అయితే ఈ పోస్టర్ లో ఇంటెన్సిటీ చూస్తుంటే తన రూటును కొంచెం మార్చి రౌడీగారి రూటుకు వచ్చినట్టే అనిపిస్తోంది. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కెఎ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



Tags:    

Similar News