'విక్రమ్-2' సక్సెస్ తో విశ్వనటుడు కమల్ హాసన్ బౌన్స్ బ్యాక్ అయ్యారు. మరో విజయం దక్కడం ఆలస్యమైనా గట్టిగానే కొట్టారు. కమల్ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంలో ఉన్నారు. అదే ఉత్సాహంలో సినిమా కి పనిచేసిన వాళ్ల కష్టాన్ని..ప్రతిభని గుర్తించి ఖరీదైన బహుమతులు సైతం అందిస్తున్నారు. కమల్ పై అభిమానంలోఎలాంటి పారితోషికం తీసుకోని వాళ్లకి చిన్న చిన్న బహుమానాలు అందించి రుణం తీర్చుకుంటున్నారు.
కమల్ లో స్నేహశైలి స్వభావం అంటే ఎలా ఉంటుందో? మరోసారి ఇలా రుజువు చేసారు. ఇదే సందర్భంగా గతంలో తాను అన్న వ్యాఖ్యల్ని విమర్శించి..పిచ్చోడ్ని చూసినట్లు చూసిన కొందరికి ఇదే వేదికగా చెంప పెట్టులాంటి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా గతంలో తాను చేసిన వ్యాఖ్యల్ని గుర్తి చేసి మరీ విక్రమ్ -2తో బధులు తీర్చుకున్నారు.
ఓ సారి కమల్ గతంలో చేసిన వ్యాఖ్యల్లోకి వెళ్తే.. "ఓసందర్భంలో నేను 300 కోట్ల రూపాయలు సంపాదిస్తాను అంటే అంతా పిచ్చోడిలా చూసారు. వీడికేమైనా చిన్న మొదడు చిట్లీపోయిందా? అన్నట్లుగా ముఖాలు పెట్టారు. నా మాట నమ్మలేదు. అప్పుడు వాళ్లకి అర్ధం కాలేదు. కానీ ఇప్పుడది నిజమైందిగా. 'విక్రమ్ -2' విజయంతో చాలా సంతోషంగా ఉంది.
వందల కోట్ల సూళ్లని సాధిస్తుంది. ఇంకా సాధిస్తుంది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ర్టాల్లోనూ ఇప్పటికీ థియేటర్లో సినిమా రన్నింగ్ లో ఉంది. ఈ సినిమాకి వచ్చిన డబ్బులతో నా అప్పులన్నీ తిరిపోయాయి. నాకు కావాల్సింది తింటున్నాను. నా స్నేహితులకు చేతనైన సహాయం చేయగల్గుతున్నాను. ఒకవేళ నా దగ్గర డబ్బులు లేకపోతే లేవని చెప్పేస్తాను.
అంతేగానీ వేరే వాళ్ల దగ్గర తీసుకుని సాయం చేయాలి అనేంత గొప్ప మనసు నాకు లేదు. మంచి మనిషిగా ఉంటే చాలు అని కమల్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఆ నాడు కమల్ ని చిన్న చూపుగా చూసిన వారికి కౌంటర్ గానే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. 'విశ్వరూపం-2' సహా 'ఉత్తమవిలన్'..'తూగవనం' లాంటి భారీ బడ్జెట్ సినిమాలు కమల్ నిర్మాణంలో నే తెరకెక్కాయి.
ఈ సినిమాల కోసం కమల్ భారీ గా ఖర్చు చేసారు. సినిమాలు మధ్యలో నిలిచిపోయిన క్రమంలో అప్పులు తెచ్చి సినిమాల్ని పూర్తి చేసారు. అయితే రిలీజ్ తర్వాత అవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఈ క్రమంలోనే కమల్ పై కొంత మంది ఆరోపణలు చేసారు.
కమల్ సినిమాలు..ఐడియాలిజం బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవుతుందా? అని విమర్శించిన వాళ్లున్నారు. కమల్ వ్యక్తిత్వాని సైతం విమర్శించిన సందర్భాలున్నాయి. వాటికి బధులుగానే కమల్ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతున్నాయి.