రాజీ పడతారా...? సై అంటారా...?

Update: 2019-10-15 07:14 GMT
జనవరి 11న వస్తుందనుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా 'సరిలేరు నీకెవ్వరు' ఒకరోజు లేట్ గా జనవరి 12న రాబోతుంది. జనవరి 14న రావాల్సిన అల్లు అర్జున్ 'అల వైకుంఠపురం' సినిమా రెండు రోజుల ముందే జనవరి 12న విడుదల అవుతుంది. దీంతో ఈ స్టార్ హీరోల సినిమాలు రెండు ఒకేరోజు రిలీజ్ అవుతుండడంతో అటు ఈ సినిమాల ప్రొడ్యూసర్స్ ని - హీరోలని కూడా కొంచెం కలవరపెడుతుంది.

ఇంతకుముందు కూడా ఇలాంటి సిట్యువేషన్స్ వచ్చినపుడు ఆయా సినిమాల హీరోలు - దర్శకులు - నిర్మాతలు మాట్లాడుకుని డేట్స్ అడ్జస్ట్ చేసుకునే వారు. మహేష్ బాబు కూడా బాహుబలి సినిమా కోసం తన 'శ్రీమంతుడు' సినిమాని వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. అంత ఫ్రెండ్లీగా ఉండే మన హీరోలు ఇప్పుడు ఇలా పండగ రోజుల్లో పోటీకి దిగడం మంచిది కాదని అంటున్నారు. కనీసం రెండు సినిమాలకు మధ్య రెండు లేదా మూడు రోజులు గ్యాప్ ఉంటే రెండు సినిమాలకు కలెక్షన్స్ బాగుంటాయని లేకపోతె ఈ సినిమాలు ఎంత హిట్ అయినా లాభాల మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని అనుకుంటున్నారు. ఇప్పుడైనా ఈ హీరోలు - దర్శకులు తమ బెట్టు వీడి ఏదైనా రాజీ ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది.

ఈ రెండు సినిమాలు ఒకేరోజు రావడంతో మహేష్ బాబు - అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య అప్పుడే సోషల్ మీడియాలో వార్ మొదలైనది. తమ హీరో సినిమా హిట్ అవుతుందంటే తమ హీరో సినిమా హిట్ అవుతుందంటూ పోస్ట్ లు పెడుతూ - బూతులు తిట్టుకుంటూ రెచ్చిపోతున్నారు.
Tags:    

Similar News