మ‌ళ్లీ కేజీఎఫ్ లాంటివి ట్రై చేయ‌డం స‌రికాదేమో!

Update: 2021-02-25 03:30 GMT
ఎవ‌రో చేసేసిన‌వి మ‌నం రిపీట్ చేస్తే ప్ర‌త్యేక‌త ఏం ఉంటుంది? మ‌న‌కంటూ ఒక స‌ప‌రేట్ దారి ఉండాలి. అదే ర‌హ‌దారి. నా దారి ర‌హ‌దారి .. లెటజ్ డోంట్ కం ఇన్ మై వే! అన్న ర‌జ‌నీ  డైలాగ్ లా ఉండాలి. అలా కాకుండా ఫ‌లానా కేజీఎఫ్ లా ఉంది. బాహుబ‌లి లానో అవతార్ లానో ఉంది అని చెప్పుకుంటే క‌ష్టం.

కానీ ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తున్న 65 వ చిత్రం కేజీఎఫ్ ని త‌ల‌ద‌న్నేలా ఉంటుంద‌ని స్టేట్ మెంట్ ఇవ్వ‌డమే హాస్యాస్ప‌దంగా ఉంది. నిజానికి కేజీఎఫ్ ని కొట్టేలా ఉండాల‌ని ద‌ళ‌ప‌తి త‌న ద‌ర్శ‌కుడు నెల్స‌న్ కి చెప్పాడా?   ఏమో కానీ అత‌డు ఈసారి స్టంట్స్ ప‌రంగా హెవీ రేంజును ప్లాన్ చేసార‌ట‌. దానికి కేజీఎఫ్ స్ఫూర్తి అని తెలిసింది.

కేజీఎఫ్ ఫ్రాంఛైజీ ఫైట్ కొరియోగ్రాఫ‌ర్ల‌నే బ‌రిలో దించి విజ‌య్ కి యాక్ష‌న్ డిజైన్ చేశారు. అన్బ్- ఆరివుమణి బృందంలోని ఐలీప్ కుమార్ స్టంట్స్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. మా మూవీ ఫైట్స్ చూడ‌గానే కేజీఎఫ్ ఫైట్స్ ను మర్చిపోతారని ఆయ‌న అన‌డం విజ‌య్ అభిమానుల్లో ఉత్సాహం పెంచింది. దీనిని బ‌ట్టి విజ‌య్ ని భీక‌ర‌మైన యాక్ష‌న్ హీరోగా చూపిస్తున్నార‌ని అర్థమ‌వుతోంది.  

అయితే విజ‌య్ బాడీ లాంగ్వేజ్ కి కేజీఎఫ్ స్టార్ య‌ష్ బాడీ లాంగ్వేజ్ కి చాలా తేడా ఉంది. అత‌డు పూర్తి స్థాయి మాస్ యాక్ష‌న్ కి సూట‌బుల్. కానీ విజ‌య్ తుపాకి (తుప్పాకి- మురుగ‌దాస్) స్టైల్లో క్లాసీ స్టైల్ ఫైట్స్ కి బాగా సూట‌వుతాడు. మ‌రి అలాంట‌ప్పుడు హార్డ్ హిట్టింగ్ ఫైట్స్ విజ‌య్ తో చేయిస్తే ఎంత‌వ‌ర‌కూ క‌నెక్ట‌వుతాయి? అన్న‌ది చూడాలి. కేజీఎఫ్ లా హీరో ఎలివేట్ కావాలంటే ఆ రేంజు ఫైట్స్ ఉండాల‌ని ఫిక్స‌య్యి నెల్స‌న్ దిలీప్ కుమార్ అలా ప్లాన్ చేస్తున్నారా? అస‌లు ఏం జ‌రుగుతోందో చూడాలి. ఇక కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ .. ప్ర‌భాస్ స‌లార్ ని కేజీఎఫ్ లా కాకుండా కొత్త‌గా ఎలివేట్ చేయాల్సి ఉంటుంది. ఎక్క‌డో చూసేసిన‌ట్టు ఉంటే చాలా క‌ష్టం. ప్ర‌భాస్ కూడా ఆ వేరియేష‌న్ ట్రై చేయాల‌నే ఆకాంక్షిద్దాం.
Tags:    

Similar News