వావ్ - సుకుమార్ తో డ్యాన్స్ చేయించిన డీఎస్ పీ ట్యూన్‌..!

Update: 2021-02-09 15:30 GMT
వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న 'ఉప్పెన' సినిమాలో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నా.. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి మాత్రం మరింత స్పెషల్ గా చెప్పుకోవాలి. ఒక్క పాటతో సినిమా ముఖచిత్రాన్నే మార్చేశాడు డీఎస్ పీ. 'నీకన్ను నీలి సముద్రం..' అంటూ సాగిన పాటకు యూత్ మొత్తం ఊగిపోయిందంటే అతిశయోక్తి కాదు.

ఆ తర్వాత మరో పాట కూడా సినీ సంగీత ప్రియులను ఓలలాడిస్తోంది. 'రంగులద్దు కున్నా..' అంటూ సాగే ఆ మెలోడీ ట్యూన్ కు శ్రోతలు మైమరచిపోతున్నారు. అయితే.. మరో రెండు  రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్న తరుణంలో ఈ సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడు షూట్ చేసిన వీడియోను రిలీజ్ చేసింది యూనిట్.

లిరిక్ రైటర్ చంద్రబోస్ సమక్షంలో.. ఈ అద్భుతమైన ట్యూన్ ను కంపోజ్ చేసిన దేవీ.. అక్కడున్నవారిని మెస్మరైజ్ చేశారు. డీఎస్ పీ గిటార్ నుంచి ఎంతో శ్రావ్యంగా మోగుతున్న ఆ ట్యూన్ లో లీనమైపోయారు అక్కడి వారందరూ. అది ఎంతగా అంటే.. ఎప్పుడూ సైలెంట్ గా ఉండే సుకుమార్ చేత కూడా నాట్యం చేయించిందీ ట్యూన్!

ఆ ట్యూన్ వింటూ కూర్చున్న చోట నుంచి లేచి నిల‌బ‌డిన సుకుమార్.. గిటార్ ను వాయిస్తున్న‌ట్టుగా ఫోజ్ పెట్టి చిన్న‌పాటి స్టెప్ వేయ‌డం విశేషం. ఆ త‌ర్వాత.. చ‌ప్ప‌ట్ల‌తో దేవీని అభినందించిన సుక్కూ.. మ‌న‌స్ఫూర్తిగా గుండెల‌కు హ‌త్తుకున్నాడు. దేవీశ్రీ ప్ర‌సాద్‌.. సుకుమార్ ఆస్థాన విద్వాంసుడు అన్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చే ఆల్బం ఎందుకు హిట్ అవుతుందో చెప్ప‌క‌నే చెప్పిందీ వీడియో. సుకుమార్ వ‌ద్ద తాను చాలా ఫ్రీగా వ‌ర్క్ చేసుకుంటాన‌ని గ‌తంలో ప్ర‌క‌టించాడు డీఎస్ పీ.

మొత్తానికి 'ఉప్పెన'కు రావాల్సినంత హైప్ వచ్చేసింది. అన్ని విభాగాల నుంచి అందరూ తలా ఒక చెయ్యి వేసినప్పటికీ.. మ్యూజిక్ విభాగం నుంచి డీఎస్ పీ అందించిన సహకారం మరింత ఎక్కువ అనడమే కాకుండా.. సో.. స్వీట్ అనొచ్చు. ఈ నేపథ్యంలో.. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. ఈ బజ్ తో దూసుకెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Tags:    

Similar News