పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో తేరీ రాబోతున్నట్లు దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే సోషల్ మీడియాలో అలాంటి రీమేక్ సినిమా మాకు వద్దు అని ఫ్యాన్స్ ఎంత మొత్తుకుంటున్నా కూడా ఇప్పటివరకు మైత్రి మూవీ మేకర్స్ అలాగే దర్శకుడు హరిష్ శంకర్ ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాకుండా దర్శకుడు అయితే అలాంటి రీమేక్ వద్దని అడిగితే అలాంటి నెటిజన్లను బ్లాక్ చేసేస్తున్నాడు.
దాదాపు మూడేళ్ళ నుంచి మరొ సినిమాను తెరపైకి తీసుకురావాలి అని ఎంతో ప్రయత్నంలో చేస్తున్న హరీష్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఛాన్స్ దూరం చేసుకోకూడదు అని మొండి పద్ధతులతో ఉన్నట్లుగా అర్థమవుతుంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్టు పనుల్లో త్రివిక్రమ్ స్నేహితుడు దశరథ్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.
త్రివిక్రమ్ తో పాటు ఇండస్ట్రీలోకి దాదాపు ఓకేసారి వచ్చిన రచయితల్లో దశరథ్ కూడా ఉన్నాడు. అతను మొదట రైటర్ గా వర్క్ చేసి ఆ తర్వాత నాగార్జున సంతోషం సినిమాతో మంచి దర్శకుడిగా గుర్తింపు అందుకున్నాడు.
దశరథ్ కెరీర్ లో విజయాల కంటే ఫ్లాప్స్ ఎక్కువగా ఉన్నాయి. అప్పట్లో అతను ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతోనే భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ సక్సెస్ కూడా చూడలేదు.
చివరిగా 2016లో మంచు మనోజ్ తో శౌర్య సినిమా చేశాడు. ఆ సినిమా హీరోకు కూడా ఏమాత్రం ఉపయోగపడలేదు. అయితే త్రివిక్రమ్ సలహా మేరకే తేరి రీమేక్ కోసం అతన్ని రైటర్ గా పెట్టుకోవాలి అని హరిష్ శంకర్ కు పవన్ సూచించినట్లుగా తెలుస్తోంది. హరీష్ శంకర్ కు కూడా ఎప్పటినుంచో దశరథ్ తో మంచి పరిచయం ఉంది.
ఇక రీసెంట్ గా దశరథ్ నిర్మించిన 'లవ్ యు రామ్' అనే టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమాకు దశరథ్ కూడా రైటర్ గా వర్క్ చేస్తున్నట్లుగా తెలిపారు. మరి దశరథ్ ఆలోచన విధానం ఈ సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.