ఆ రచయితకు ఎన్టీఆర్‌ అంటే ఇంత అభిమానమా..!

Update: 2022-07-02 06:10 GMT
టాలీవుడ్ లో ఈమద్య కాలంలో రచయితలకు బాగా ప్రాముఖ్యత పెరుగుతోంది. త్రివిక్రమ్‌ నుండి మొదలుకుని సాయి మాధవ్ బుర్రా వరకు రచయితలుగా ఉన్న సమయంలోనే మంచి గుర్తింపును దక్కించుకున్నారు. రచయితలు దర్శకులు మారిన సందర్బాలు టాలీవుడ్‌ లో చాలా ఉన్నాయి. మంచి రచయిత మంచి దర్శకుడు అవుతాడు అంటూ ఇండస్ట్రీలో టాక్ ఉంది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా గురించి తెగ చర్చ జరుగుతోంది. పెద్ద హీరోలు దాదాపు అంతా కూడా ఆయన తమ సినిమాలకు వర్క్ చేయాలని కోరుకుంటున్నారు. కుదరకుంటే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలకు అయినా ఆయన రచన సహకారం అందించాలని భావిస్తున్నారు. అందుకే ప్రస్తుతం టాలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ రైటర్ గా సాయి మాధవ్ కొనసాగుతున్నారు.

రాజమౌళి వంటి గ్రేట్‌ డైరెక్టర్‌ సాయి మాధవ్ బుర్రా తో వర్క్ చేసేందుకు ఆసక్తి చూపించాడు అంటే సాయి మాధవ్ యొక్క ప్రతిభ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మొదటగా దర్శకుడు క్రిష్ ప్రోత్సాహంతో సాయి మాధవ్ బుర్రా ఇండస్ట్రీలో మంచి పేరు దక్కించుకోగలిగాడు. క్రిష్‌ ఇచ్చిన అవకాశాలను సాయి మాధవ్ బుర్రా అద్బుతంగా వినియోగించుకుని ఇప్పుడు టాప్ స్టార్‌ గా నిలిచాడు.

తాజాగా ఆయన రామ్‌ చరణ్‌.. శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆర్ సీ 15 సినిమా కు రచయితగా వర్క్ చేస్తున్నాడు. జెంటిల్మెన్‌ సినిమా చూసి ఒక్క సారి శంకర్ గారిని చూసి.. ఫోటో దిగిన చాలు అనుకున్నాను. అలాంటిది ఇప్పుడు ఆయనతో వర్క్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నాడు. చిన్నప్పటి నుండి కూడా సీనియర్ ఎన్టీఆర్‌ అంటే విపరీతమైన ఇష్టంతో సినిమాల్లోకి సాయి మాధవ్ బుర్రా అడుగు పెట్టాడట.

సాయి మాధవ్ బుర్రాకు ఎన్టీఆర్‌ అంటే ఎంత అభిమానమో ఈ సంఘటన చెప్పకనే చెబుతోంది.. ప్రస్తుతం తెనాలి పట్టణం లో ఎన్టీఆర్‌ శతజయంతి మహోత్సవాలు ఏడాది పాటు ఘనంగా నిర్వహిస్తున్నాడు. వారంలో అయిదు రోజుల పాటు తెనాలి పట్టణంలో ఎన్టీఆర్‌ సినిమాలను స్క్రీనింగ్‌ చేస్తూ.. వీకెండ్స్ లో ఎన్టీఆర్‌ కు సంబంధించిన విషయాల గురించి సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఇదంతా కూడా ఒక అభిమానిగా సాయి మాధవ్‌ బుర్రా తెనాలి లో చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అభిమాన నటుడి కోసం ఇంతగా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎన్టీఆర్‌ అంటే ఆయనకు ఇంత అభిమానమా అన్నట్లుగా అంతా నోరు వెళ్లబెట్టి చూసేంత అభిమానం ను ఆయన చూపించడం అభినందనీయం అంటూ నందమూరి అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News