నేడు రైతు సమస్యలపై దేశం మొత్తం మాట్లాడుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో బర్నింగ్ టాపిక్ పై సినిమా చేశామని అంటున్నారు బుర్రా సాయిమాధవ్. అతడు మాటలు అందిస్తున్న తాజా చిత్రం శ్రీకారం. శర్వానంద్ హీరో. కిషోర్ బి దర్శకుడు. ప్రియాంక మోహన్ కథానాయిక. రావు రమేష్ ఒక ముఖ్య పాత్రలో నటించారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. సెన్సార్ క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ చిత్రం మార్చి 11 న మహా శివరాత్రి స్పెషల్ గా విడుదలవుతోంది.
ఈ చిత్రంలో వ్యవసాయం ప్రాముఖ్యతను చూపిస్తున్నారని ట్రైలర్ వెల్లడించింది. అందులో సంభాషణల్లో అది అర్థమైంది. ఆ అద్భుతమైన డైలాగుల్ని అందించిన రచయిత సాయిమాధవ్ బుర్రా ఏమంటున్నారంటే.. ``వ్యవసాయం చేయనివాడు తిండి మానేయాలి. వ్యవసాయం మానేస్తే భోజనం తినకూడదు. ఈ కథ వ్యవసాయం గురించి.. గంట పాటు వ్యవసాయంపైనే.. ఇది దేశం మొత్తం రైతు గురించి మాట్లాడుతున్న సమయంలో వస్తున్న సినిమా. ఈ చిత్రానికి రాయడం నా బాధ్యత అని నేను భావించాను. టీమ్ సభ్యులు అంతా బాధ్యతగా భావించి పని చేశారు`` అని సాయి మాధవ్ అన్నారు.
రైతు కొడుకు రైతు కావడం లేదు! అనే డైలాగ్ తోనే కంటెంట్ లో మ్యాటరేంటో చెప్పేశారు సాయి మాధవ్. వ్యవసాయం చేయకపోతే మనం తినడం మానేయవచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు. అందమైన పాత్రలు భావోద్వేగాలతో కలబోసిన కమర్షియల్ చిత్రమిదని తెలిపారు. నిజం చెప్పాలంటే రైతుపై సినిమా అతి పెద్ద కమర్షియల్ సినిమా అని ఆయన అన్నారు.