'మనవాళ్లు సరిగా నాకోసం ఒక కథ కూడా రాయలేకపోతున్నారు'అని మొన్నా మధ్య మెగస్టార్ చిరంజీవి ఓ మాట అన్నారు. అది అక్షర సత్యమనే మాట ఇపుడందరికీ భాగా తెలుస్తోంది. అటు చిరంజీవికనే కాదు చాలామంది హీరోలు ఓపెన్ అవ్వడం లేదు గాని కథలు తయారు చేయడంలోను - చేయించుకోవడంలోను మనవాళ్లు బయటివారితో పోల్చితే చాలా వెనకపడి ఉన్నారు. టాలీవుడ్లో గత కొంతకాలంగా స్టోరీ సిట్టింగ్స్ లో నలుగుతోన్న కథలు ఓకే కావడం చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. ఫేమ్ ఉన్న దర్శకులైతే నెలలు - సంవత్సరాలు తరబడి కంటెంట్ ఉన్న కథ కోసం ఎదురు చూస్తున్నారు. ఇపుడున్న టైమ్ లో స్టోరీ రాసింది రైటర్ అయినా దర్శకుడైనా... అటు హీరోకి సబ్జెక్ట్ చెప్పి ఎలా ఒప్పిస్తున్నాడు, వాటిని బడా హీరో ఏ యాంగిల్ లో చూసి యాక్సెప్ట్ చేస్తున్నాడనేదే... ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
మరి ఆ రోజుల్లో టాలీవుడ్లో.... రచయితలనేవారు స్టోరీ సిట్టింగ్స్ కోసం హీరోలు - నిర్మాతల గెస్ట్ హౌస్ లనో - లేదంటే హిల్ స్పాట్స్ ఉన్న ప్రాంతాలనో నమ్ముకునేవారు. ఇపుడున్నది పూర్తిగా పూరికాలం కాబట్టి... అంతా బ్యాంకాక్ ల వరకు వెల్తున్నారు. ఐతే ఇక్కడది వేరే విషయం. అయితే ఇక్కడ మనం డిష్కస్ చేసుకోవల్సిన విషయం ఒకటుంది. బడా హీరోలకు రైటర్ అనేవాడు దర్శకుడితో కలిసి తామనుకుంటోన్న విలువైన కథను చెప్పి ఒప్పించాలంటే... మధ్యలో కొన్ని కతలు చెప్పాల్సి వస్తుంది.ఇక్కడ కతలు అంటే స్టోరీలు అని కాదు. కతలంటే తిమ్మిని బమ్మిని చేసే మాటలన్నమాట.
అలా నేలవిడిచి సాము చేసే కతలు చెబితే... కొందరు హీరోలు బ్లైండ్ గా నమ్మేస్తున్నారు. అందుకే చాలామంది స్టోరీ టెల్లర్స్ ఈ రూట్లో హీరోల దగ్గర ట్రైల్స్ వేసి.... ప్రాజెక్ట్ లు ఓకే చేయించుకుంటున్నారు. దాంతో వారికి ఈజీగా పనై పోతుంది. హీరోలకు కూడా కధ చెప్పేవారి కంటే.... ఇలా కతలు చెప్పేవారంటేనే ఇష్టం కాబట్టి కంటెంట్ ఉన్న రచయితలు కూడా తమ సబ్జెక్ట్ ను ఎక్స్ ప్లెయిన్ చేయడానికి మాంచి మాటకారులను వెతుక్కుంటున్నారు.
అయితే ఇక్కడ .... కబుర్లను ఎంజాయ్ చేస్తూ కతలు వినే డెసిషన్ మేకర్స్ కు ... కథలోని కంటెంట్ ను సరిగా పట్టుకునే నేర్పు దొరికితే సరే సరి. లేదంటే మొదటికే మోసం జరుగుతుంది. ఇపుడున్న టైమ్లో పరిశ్రమలో సర్వత్రా వినిపించే మాట ఒకటే. కల్లబొల్లి కతలు చెప్పేవారు తప్ప... కంటెంట్ తో అడుగు పెట్టే టాలెంట్ రైటర్స్ .... హీరోల కాంపౌండ్లోకి కనీసం కాలు కూడా పెట్టలేకపోతున్నారని.
ఆ కంటెంట్ రైటర్స్ రచయితలు కావచ్చు లేదంటే కొత్త దర్శకులు కావచ్చు.