స‌ల్మాన్ ఖాన్ కు వై ప్ల‌స్ కేటాగిరి భ‌ద్రత‌!

Update: 2022-11-01 11:43 GMT
బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ గ‌త కొంత కాలంగా వ‌రుసగా వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆయ‌న‌కు పంజాబ్ కు చెందిన గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్‌ బిష్టోయ్ వ‌ల్ల స‌ల్మాన్ ఖాన్ కు ప్రాణ హానీ వుందంటూ ప్రచారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌య‌మై స‌ల్మాన్ ఖాన్ కు గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్‌ బిష్టోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు కాల్స్ రావ‌డంతో అప్ప‌మ‌త్త‌మైన మ‌హారాష్ట్ర ప్రభుత్వం స‌ల్మాన్ ఖాన్ కు భ‌ద్ర‌త‌ని పెంచుతున్న‌ట్టుగా ప్న‌క‌టించింది.

గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్‌ బిష్టోయ్ గ్యాంగ్ వ‌ల్ల స‌ల్మాన్ ఖాన్ కు ప్ర‌మాదం వుంద‌ని రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ‌ర్గాల ద్వారా అందిన స‌మాచారం మేర‌కు రంగంలోకి దిగిన రాష్ట్ర ప్ర‌భుత్వం స‌ల్మాన్ కు వై ప్ల‌స్ కేట‌గిరి భ‌ద్ర‌త‌ను పెంచుతున్న‌ట్టుగా మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది.

ఇదే స‌మ‌యంలో బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్ష‌య్ కుమార్ కు ఎక్స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తున్న‌ట్టుగా వెల్ల‌డించారు. స‌ల్మాన్ ఖాన్ కు ఇంత వ‌ర‌కు వై కేట‌గిరీ భ‌ద్ర‌త కొన‌సాగుతూ వ‌స్తోంది.

అయితే గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్‌ బిష్టోయ్ బెదిరింపుల నేప‌థ్యంలో సల్మాన్ ఖాన్ కు వున్న వై కేట‌గిరీకి మించి వై ప్ల‌స్ భ‌ద్ర‌త‌ని పెంచారు. తాజాగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన వై ప్ల‌స్ భ‌ద్ర‌త నేప‌థ్యంలో స‌ల్మాన్ కు ఇద్ద‌రు సాయుధ గార్డ్ లు భ‌ద్ర‌త క‌ల్పిస్తూ ఆయ‌న వెంటే వుండ‌నున్నారు. అంతే కాకుండా స‌ల్మాన్ ఇంటి వ‌ద్ద కూడా ప్ర‌త్యేక సిబ్బందిని ఏర్పాటు చేశార‌ని తెలిసింది. ఇదే స‌మ‌యంలో అక్ష‌య్ కుమార్ కు కూడా ప్ర‌భుత్వం భ‌ద్ర‌త‌కు క‌ట్టుదిట్టం చేసింది.

ఎక్స్ భ‌ద్ర‌త దృష్ట్యా అక్ష‌య్ కి ముగ్గురు అధికారులు మూడు షిఫ్ట్ ల కింద ర‌క్ష‌ణగా వుండ‌నున్నార‌ట‌. ఇదిలా వుంటే మ‌హారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ స‌తీమ‌ణి అమృత ఫ‌డ్న‌వీస్ కు కూడా మ‌హా ప్ర‌భుత్వం వై ప్ల‌స్ భ‌ద్ర‌త‌ని కేటాయించడం గ‌మ‌నార్హం.

ఈ విష‌యం ప‌క్క‌న పెడితే స‌ల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం 'కిసీకీ భాయ్ కిసీకీ జాన్‌' అనే మూవీలో న‌టిస్తున్నాడు. హీరోయిన్ గా పూజా హెగ్డే న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌ల్లో విక్ట‌రీ వెంక‌టేష్, జ‌గ‌ప‌తిబాబు, కీల‌క అతిథి పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ క‌నిపించ‌బోతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News