ఈ ఏడాది ఆరంభం వరకు సోనూ సూద్ అంటే ఒక మంచి నటుడు.. విలన్ గా ఎన్నో సినిమాల్లో ఆకట్టుకున్న వ్యక్తి. సౌత్ తో పాటు ఉత్తరాదిన కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడిగా గుర్తింపు ఉంది. కరోనా లాక్ డౌన్ సమయంలో అనూహ్యంగా అతడి ఇమేజ్ మారిపోయింది. విలన్ కాస్త హీరో అయ్యాడు. అది కూడా రియల్ హీరో అయ్యాడు. వేలాది మంది వలస కార్మికులకు దేవుడు అయ్యాడు. వందలాది మందికి ఆయన చేసిన సాయంతో జీవితాలు నిలిచాయి. అందుకే రియల్ హీరో అంటూ ఆయనకు అభిమానులు కూడా అయ్యారు.
ప్రముఖ వెబ్ సైట్ యాహూ వారు సోనూ సూద్ ను 'హీరో ఆఫ్ ది ఇయర్' అంటూ ప్రకటించింది. లక్షలాది మంది వలస కార్మికులు లాక్ డౌన్ సమయంలో వారి వారి ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న సమయంలో సోనూ సూద్ తన వంతు సాయంగా ముందుకు వచ్చి బస్సులు.. రైళ్లు.. విమానంతో సహా ఎవరికి అవసరం అయిన వాటి ద్వారా వారి గమ్య స్థానాలకు చేర్చారు. ఈ క్రమంలో ఆయన ఎంతో ఖర్చు చేశారు.
వలస కార్మికులు తమ ఇళ్లకు వెళ్తున్న సమయంలో ప్రమాదాలు జరిగి మృతి చెందితే వారి కుటుంబాలను కూడా ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. ఇక సోషల్ మీడియా ద్వారా ఎవరైనా తనను సాయం అని అడిగితే వెంటనే రెస్పాండ్ అయిన వ్యక్తి సోనూసూద్. అందుకే హీరో ఆఫ్ ది ఇయర్ సోనూ సూద్ అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ యహూ పేర్కొంది.