సెక్సీ హీరోయిన్ విలన్ గా చేస్తుంది!

Update: 2017-01-19 06:37 GMT
హీరోయిన్.. కేవలం హీరోయిన్ గా, గ్లామర్ కోసమే నటించడం కాకుండా... కథలో కీలక భూమిక పోషించే పాత్రలు దొరకడం చాలా అరుదు. అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకుంది యామీ గౌతమి. అది కూడా నెగిటివ్ రోల్ కావడం విశేషం! ఈ కీలక పాత్ర చేయడం ద్వారా యామీ తన కెరీర్ లో ఒక కీలకమైన సమయాన్ని అనుభవిస్తున్నట్లే చెబుతున్నారు బాలీవుడ్ జనాలు.

విషయానికొస్తే... "వంగవీటి" సినిమాతో దర్శకుడిగా "వర్మ ఈస్ బ్యాక్" అనుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అది జరగలేదనే చెప్పాలి! ఈ సమయంలో వర్మ హోప్స్ అన్నీ "సర్కార్ 3" పై ఉన్నాయనేది నిర్వివాదాంశం. ఈ వెటరన్ డైరెక్టర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం "సర్కార్-3" కోసం తాజాగా యామీ గౌతమిని తీసుకున్నారట. అది కూడా విలన్ పాత్ర కోసం.

అమితాబ్ సినిమా కావడంతో ఆమె కూడా ఎలాంటి అభ్యంతరాలు పెట్టలేదని తెలుస్తుంది. ఈ సినిమాలో తన తండ్రిని చంపిన సర్కార్ పై పగ తీర్చుకోవడానికి వచ్చే యువతి పాత్రలో యామీ నటిస్తోంది. ఈ సందర్భంగా స్పందించిన యమీ... అమితాబ్ తో నటించాలనే తన కల నెరవేరిందని, ఆయనతో నటించే అవకాశం కోసమే ఎదురు చూస్తున్నానని చెప్తుందట. మరి విలన్ రోల్ కదా...? అని ఎవరైనా ప్రశ్నిస్తే... "అమితాబ్ తో నటించడం ముఖ్యం.. అది విలన్ రోలా - హీరోయిన్ రోలా అన్నది ముఖ్యం కాదు" అని తెగేసి చెబుతుందట.

ఇదిలా ఉంటే... హృతిక్ సరసన యామీ నటించిన "కాబిల్" (తెలుగులో "బలం") సినిమా వచ్చేవారం విడుదలకానుంది. ఈ సినిమాతో టాప్ స్టార్స్ లిస్ట్ లో యామీ చేరిపోనుందని కథనాలొస్తున్న తరుణంలో, నెగిటివ్ రోల్ చేయడానికి ఆమె ముందుకు రావడంతో నటిగా మంచి మార్కులు కొట్టేయడం గ్యారెంటీ అంటున్నారు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News