కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన `కేజీఎఫ్ చాప్టర్- 1` సంచలనాల గురించి తెలిసిందే. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 350 కోట్ల వసూళ్లు సాధించింది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. అటు కన్నడం.. హిందీలో కేజీఎఫ్ సంచలన విజయం సాధించగా.. ఇటు తెలుగులో చక్కని వసూళ్లతో ఆకట్టుకుందని ట్రేడ్ రిపోర్ట్ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫ్రాంఛైజీలో సీక్వెల్ సినిమా కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఆన్ సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ స్వింగులో ఉంది.
తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీ .. భళ్లారి గనుల్లో భారీ షెడ్యూల్స్ ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ నాటికి 80 - 90శాతం చిత్రీకరణ పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం బెంగళూరులో షూటింగ్ చేస్తున్నారు. తర్వాత మైసూర్ లో షూటింగ్ చేస్తారు. అటుపై రామోజీ ఫిలింసిటీ షెడ్యూల్ ఉంటుంది. చివరిగా కర్నాటక- భళ్లారిలో షెడ్యూల్ తో మెజారిటీ పార్ట్ చిత్రీకరణ పూర్తవుతుంది. దాదాపు 90శాతం అప్పటికి పూర్తవుతుంది అని కేజీఎఫ్ టీమ్ అధికారికంగా ప్రకటించింది.
కేజీఎఫ్ సిరీస్ కేవలం చాప్టర్ 2తో ముగింపు కాదని తెలుస్తోంది. అలాగే చాప్టర్ 2లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్.. సీనియర్ కథానాయిక రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సీక్వెల్ లో తొలి భాగాన్ని మించి భారీ యాక్షన్ ని చూపించనున్నామని దర్శకుడు ప్రశాంత్ నీల్.. యశ్ ఇదివరకూ వెళ్లడించారు. కేజీఎఫ్ అంటే కోలార్ బంగారు గనులు (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) అని అర్థం. దశాబ్ధాల క్రితం కోలార్ బంగారు గనుల్లో మాఫియా కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కేజీఎఫ్ గనులపై ప్రపంచ వ్యాపారుల కన్ను ఎలా ఉండేది అన్నదానిని తొలి భాగంలోనే అద్భుతంగా రివీల్ చేశారు. ఇక ఈ మాఫియా గ్యాంగ్స్ ఒకరిని మించి ఒకరు అరాచకులుగా ఎలాంటి రాక్షసకాండను నడిపించేవారో తెరపై అద్భుతంగా చూపించారు. ఈ సీక్వెల్ లో ఇంకా భీకర పోరాటాల్ని తెరపై చూపించనున్నారు. సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేస్తారా.. లేదా సంక్రాంతి కానుకగా జనవరిలోనా అన్నది తెలియాల్సి ఉంది.