కేజీఎఫ్ చాప్టర్-1 సక్సెస్.. బాక్సాఫీస్ గణాంకాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై పాన్ ఇండియా లెవల్లో విజయాన్ని అందుకుంది. దాదాపు 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించి కన్నడ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. దీంతో కేజీఎఫ్ చాప్టర్-2ని భారీ అంచనాల మధ్య తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా కేటగిరిలో భారీ అంచనాల నడుమ ఈ సీక్వెల్ రిలీజ్ కానుంది. అందుకు తగ్గట్టు బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ ని రంగంలోకి దించి సినిమాపై మరింత అంచనాలు పెంచేసారు.
కేజీఎఫ్ తెచ్చిన వసూళ్ల నేపథ్యం లో కేజీఎఫ్-2 రైట్స్ కోసం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ప్రీ బిజినెస్ గెట్లు తెరుచుకోగానే భారీగా చెల్లింపులు చేసి రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ పెద్ద ఎత్తున జరుగనుందని ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే చిత్ర నిర్మాతలు అంతకు మించి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా టీజర్- ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత బిజినెస్ కి గేట్లు తెరవనున్నారుట. అప్పటి వరకూ సినిమా కు సంబంధించి ఎలాంటి బిజినెస్ జరగదని అంటున్నారు.
కేవలం చాప్టర్ వన్ రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు మాత్రమే అందుబాటు ధరలో సినిమా ఉంటుందని... మిగతా డిస్ట్రిబ్యూటర్లు అంతకుమించి వెచ్చించక తప్పదని అంటున్నారు. ట్రైలర్- టీజర్ రిలీజ్ తర్వాత వచ్చిన బజ్ ని బట్టి...బయ్యర్ల మధ్య పోటీని బట్టి ఏ ఏరియాకు ఎంతకు అమ్మాలి! అన్నది డిసైడ్ కానున్నారుట. కేజీఎఫ్ చాప్టర్ -1 తో అన్ని ఏరియాల పంపిణీదారులు పెట్టిన దానికంటే భారీగా లాభాలు ఆర్జించిన సంగతి తెలిసిందే. అందుకే చాప్టర్ -2 రేట్లు చుక్కలు చూపించేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారుట.