క్యూట్ పోజిచ్చిన కేజీఎఫ్ హీరో

Update: 2019-04-01 07:09 GMT
'కేజీఎఫ్: చాప్టర్ 1' తో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు కన్నడ స్టార్ హీరో యష్.   ప్రస్తుతం 'కేజీఎఫ్: చాప్టర్ 2' సినిమా షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు.  'కేజీఎఫ్' లో  సినిమాలో ఒక భయంకరమైన గ్యాంగ్ స్టర్ గా శత్రువులకు వెన్నులో వణుకుపుట్టించే వ్యక్తిగా కనిపించిన యష్ రియల్ లైఫ్ లో మాత్రం చాలా స్వీట్ పర్సన్.

కన్నడ హీరోయిన్ రాధిక పండిట్ ను యష్ ప్రేమ వివాహం చేసుకున్నాడని తెలిసిందే.  ఈ జంటకు ఒక పాప కూడా ఉంది.  ఇక యష్-రాధికల జంట కన్నడ ఇండస్ట్రీలో క్యూటెస్ట్ కపుల్స్ లో ఒకటి. రీసెంట్ గా రాధిక తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక సెల్ఫీ పోస్ట్ చేసింది. అందులో యష్ కూడా ఉన్నాడు.  వైట్ టీ-షర్ట్ లో గుబురు గడ్డంలో ఉన్న యష్ తన ఎక్స్ ప్రెషన్ మాత్రం చిలిపిగా ఇచ్చాడు. రాధిక వెనకే నిలబడి కన్నుగీటాడు.  ఈ ఫోటో కు "ఇంపర్ఫెక్ట్ లవ్ ను పర్ఫెక్ట్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నాం" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  దీన్ని తెలుగులోకి అనువదిస్తే అంత అందంగా ఉండదు కాబట్టి అలానే అర్థం చేసుకోండి.

అసలే యష్ క్రేజ్ పీక్స్ లో ఉండడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  చాలామంది ఈ ఫోటోకు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు.  రాకీ భాయ్ స్వీట్ గా ఉన్నాడని.. సినిమాలో ఎంత పెద్ద డాన్ అయినా రాధిక వదిన దగ్గర రాకీ భాయ్ పప్పులు ఉడకవని అంటున్నారు.  


Tags:    

Similar News