పాన్ ఇండియా బాటిల్ కి సామ్ స‌ర్వం సిద్దం!

Update: 2022-11-03 15:06 GMT
స‌మంత న‌టించిన లేటెస్ట్ సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `య‌శోద‌`. ఈ మూవీపై సామ్ భారీ ఆశ‌లే పెట్టుకుంది. కార‌ణం సామ్ న‌టించిన తొలి పాన్ ఇండియా మూవీ కాబ‌ట్టి. హ‌రి - హ‌రీష్ ఈ మూవీ ద్వారా ద‌ర్శ‌కులుగా త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నారు. శ్రీ‌దేవి మూవీస్ బ్యాన‌ర్ పై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ చాలా ఏళ్ల విరామం త‌రువాత చేస్తున్న భారీ మూవీ ఇది. స‌రోగ‌సీ మాఫీయా నేప‌థ్యంలో సాగే మెడిక‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్ గా ఈ మూవీని స‌రి కొత్త కోణంలో తెర‌కెక్కించారు.  

టీజ‌ర్‌, ట్రైల‌ర్ ల‌తో సినిమాపై అంచ‌నాల్ని క్రియేట్ చేసిన హ‌రి - హ‌రీష్ ఈ మూవీలో సామ్ ని స‌రికొత్త కోణంలో ఆవిష్క‌రించిన తీరు ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త అనుభూతిని క‌లిగించ‌బోతోంది. ట్రైల‌ర్ లో సామ్ పై చిత్రీక‌రించిన యాక్ష‌న్ ఘ‌ట్టాలు  సినిమాకు ప్ర‌ధాన హైలైట్ గా నిల‌వ‌నున్నాయ‌ని తెలుస్తోంది.

భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ మూవీని న‌వంబ‌ర్ 11న ఐదు భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్ ని ప్రారంభించిన చిత్ర బృందం రిలీజ్ టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో మ‌రింత జోరుని పెంచేశారు.

ఇదిలా వుంటే గురువారం ఈ మూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. యు/ఏ స‌ర్టిఫికెట్ ల‌భించింది. యాక్ష‌న్ ప్యాక్డ్ ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ మూవీ కోసం గ‌త కొన్ని నెల‌లుగా సామ్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా రోజులుగా సైలెంట్ అయిపోయిన చిత్ర బృందం తాజాగా సినిమా రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించి ప్ర‌మోష‌న్స్ విష‌యంలో జోరు పెంచేసింది. అయితే సామ్ త‌న అనారోగ్య కార‌ణాల‌తో గ‌త కొంత కాలంగా బాధ‌ప‌డుతున్నానంటూ ప్ర‌క‌టించ‌డంతో ఈ మూవీపై ఉన్న‌ట్టుండీ సింప‌తీ ఫ్యాక్ట‌ర్ మొద‌లైంది.

దీంతో మునుపెన్న‌డూ లేని విధంగా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు ఈ మూవీ కోసం ఆస‌క్తిగా ఎదురుచూడ‌టం మొద‌లు పెట్టారు. తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో సింప‌తీ ఫ్యాక్ట‌ర్ కార‌ణంగా ఈ మూవీకి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ల‌భించే అవ‌కాశం వుంద‌ని ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. ఉన్ని ముకుంద‌న్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీకి మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News