సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "యశోద". సరోగసీ నేపథ్యంలో ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కింది. హరి & హరీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.
"యశోద" మూవీ ఈ శుక్రవారం (నవంబర్ 11) థియేటర్లలోకి రాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు హిందీ తమిళం కన్నడ మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారం చేస్తోంది.
ఇటీవల వచ్చిన "యశోద" ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అనారోగ్యం కారణంగా ఇన్నాళ్లూ ప్రమోషన్స్ కు దూరంగా ఉన్న సామ్.. లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూ రికార్డ్ చేసి మీడియా - సోషల్ మీడియాలో వదిలారు.
ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బజ్ లేకపోయినా సమంత స్టార్ డమ్ జనాలను థియేటర్లకు రప్పిస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. ఫైనల్ కాపీ చూసిన సామ్ సైతం ఈ మూవీ రిజల్ట్ మీద కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇండస్ట్రీలో 40 ఏళ్ల అనుభవం అన్న నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్.. సమంత మార్కెట్ ను నమ్మి "యశోద" సినిమా మీద భారీ పెట్టుబడి పెట్టారు. నాలుగు కోట్లలో తీయాలని దర్శకులు రాసుకున్న కథను.. గ్లోబల్ రీచ్ ఉంటుందని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తీర్చిదిద్దారు.
ఈ సినిమాకి అన్నీ ఖర్చులు కలుపుకొని 40 కోట్ల వరకూ అయిందని నిర్మాత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. విడుదలకు ముందే కంఫర్ట్ లెవల్ లోకి వచ్చిందని.. రిలీజ్ తర్వాత కూడా కంఫర్టబుల్ గా ఉంటానని పేర్కొన్నారు. అయితే సోషల్ మీడియాలో ఓ వర్గం మాత్రం ఈ చిత్రానికి అంత బడ్జెట్ కాలేదని.. నిర్మాత పదిహేను కోట్లు ఎక్కువ చేసి చెప్తున్నారని ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు యాభై కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని అంటున్నారు.
నిజానికి 'యశోద' సినిమాని ఏపీ మరియు తెలంగాణలో దాదాపు పది కోట్లకు అమ్మారని తెలుస్తోంది. ఓవర్ సీస్ లో కోటిన్నర వరకూ పలికిందని టాక్. డిజిటల్ రైట్స్ ద్వారా 20 కోట్లకు పైగా వచ్చిందని తెలుస్తోంది. ఇలా సమంత సినిమాకి 30 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక నార్త్ ఇండియాలో యూఎఫ్ఓతో కలసి.. కర్ణాటకలో డిస్నీ వాళ్ళ ద్వారా యశోద సినిమాని విడుదల చేస్తున్నారు. తమిళ్ మరియు మలయాళంలో సూర్య కంపెనీ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. అలానే శాటిలైట్ రైట్స్ కూడా ఇంత వరకు అమ్ముడు కాలేదు.
వాస్తవానికి "యశోద" సినిమా ఇప్పటికే రిలీజ్ కావల్సింది. అప్పుడెప్పడో షూటింగ్ పూర్తయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవుతూ వచ్చింది. దీంతో వడ్డీలు మరియు పబ్లిసిటీ ఖర్చులు కలిపి నలబై కోట్ల వరకూ అయినట్లు నిర్మాత చెప్పినట్లుగా అర్థమవుతోంది. కానీ ఇప్పటి వరకు రికవరికీ అయిన దాన్ని బట్టి చూస్తే నిర్మాత డెఫిసిట్ లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సినిమా ఫలితం మీద మేకర్స్ ధీమాగా ఉన్నారు. సమంత 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తో సమంత నార్త్ లో పాపులర్ అయింది కాబట్టి.. హిందీలో మంచి వసూళ్ళు వస్తాయని ఆశిస్తున్నారు. అందులోనూ ఈ వారంలో తెలుగుతో పాటుగా మిగతా భాషలలోనూ క్రేజీ చిత్రాలేవీ లేవు కాబట్టి.. యశోదకు కలిసొస్తుందని భావిస్తున్నారు.
గతంలో అనుష్క "అరుంధతి" "రుద్రమదేవి" "భాగమతి" వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సత్తా చాటింది. ఇప్పుడు సమంత కూడా "యశోద" సినిమాతో నిర్మాతకు లాభాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి.