నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ లు జంటగా నటించిన "18 పేజెస్" సినిమా డిసెంబర్ 23న రిలీజ్ కాబోతున్న విషయం తెల్సిందే. కార్తికేయ 2 సినిమా తో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ మరియు అనుపమ పరమేశ్వరన్ జంటగా రూపొందిన ఈ సినిమా ను మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు. బన్నీ వాసు నిర్మాణంలో పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇటీవలే ఈ చిత్ర టీజర్ మరియు పాట టైం ఇవ్వు పిల్ల అనే పాటలకు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది.
ఇప్పుడు సిద్ శ్రీరామ్ పాడిన పాట ఏడు రంగుల వాన విడుదల అయ్యింది. గోపి సుందర్ మ్యూజికల్ లో శ్రీమణి రాసిన ఈ "ఏడు రంగుల వాన" పాటను మీడియా సమావేశంలో చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ రిలీజ్ చేశారు.
ఏడు రంగులు వాన.. రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే. అక్షరాలా నువ్వే ఇన్ని నాల్లుగా ఉన్నా ఇప్పుడే పుడుతున్నా.. కారణం ఎవరంటే.. కచ్చితంగా అది నువ్వే.. అంటూ సాగే ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాలను టచ్ చేస్తుంది అంటూ అల్లు అరవింద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మేము తీసిన "18 పేజెస్" సినిమా ఒక సాధారణ మైన లవ్ స్టోరీ కాదు. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. గోపి గారు ఇప్పటి వరకు మా బ్యానర్ ఏడు సినిమాలు చేశాడు. ఈ సినిమాకు కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.
కార్తికేయ 2 సినిమా తరువాత అదే జోడీతో ఈ 18 పేజెస్ సినిమా రావడం చాలా హ్యాపీ గా ఉంది. నిఖిల్ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తాడు. ఈ సినిమాలో అందరూ చాలా బాగా నటించారు. ఈ నెల 23 న వస్తున్న మా చిత్రాన్ని అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
బన్నీ వాసు మాట్లాడుతూ.. హీరో నిఖిల్ కు సినిమా మీద మ్యూజిక్ మీద చాలా నాలెడ్జ్ ఉంది. జానపద పాటలు రాసే తిరిపతి గారిని ఈ సినిమాతో లాంచ్ చేస్తున్నాము. ఈ సినిమాలో తను మంచి పాట రాశారు. ఆ పాటను ఈనెల 14 న రిలీజ్ చేస్తున్నాము. డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రాన్ని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. చిత్ర దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి మాట్లాడుతూ.. నా గురువు సుకుమార్ గారు మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ చేద్దాం అన్నారు. అన్నట్టు తను మ్యూజిక్ లో నుండే కథను తయారు చేశారు. బన్నీ వాసు, అరవింద్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది.
నిఖిల్ మాట్లాడుతూ.. ప్రతి యాక్టర్ కు గీతా ఆర్ట్స్ లో వర్క్ చేయడమనేది డ్రీమ్. ఇలాంటి మంచి కథకు నన్ను సెలెక్ట్ చేసుకొన్న దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. నేను చేసిన కార్తికేయకు ఇండియా వైజ్ మంచి పేరు రావడానికి కారణం ప్రేక్షకులు మీడియానే. ఇది ఒక క్రేజీ లవ్ స్టోరీ. ఇందులో నేను సిద్దు పాత్రలో నటిస్తున్నాను. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. దర్శకులు సూర్య ప్రతాప్ గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు కథపై ఎటువంటి ఫీల్ కలిగిందో ఇప్పుడు ఆ ఫీలింగ్ డబుల్ ఐయ్యింది. ఇందులో నందిని క్యారెక్టర్ లో నటించడం జరిగింది. అందరూ నా పాత్ర డిఫరెంట్ గా ఉందని అంటుంటే చాలా హ్యాపీ అనిపించింది. కార్తికేయ 2 తరువాత నిఖిల్ తో మళ్ళీ చేయడం చాలా సంతోషంగా ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View