యెకా యెకా అంటున్న కళ్యాణ్ రామ్

Update: 2023-01-20 14:37 GMT
కళ్యాణ్ రామ్ హీరోగా గత ఏడాది విడుదలైన బింబిసర సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ రామ్ నుంచి అలాంటి సినిమా వస్తుందని కూడా చాలామంది ఎక్స్పెక్ట్  చేయలేదు. కానీ సింపుల్గా పెద్దగా ప్రమోషన్స్ కూడా లేకుండా రిలీజ్ అయిన ఆ సినిమా ప్రేక్షకులందరికీ మెప్పించింది. అలాంటి కళ్యాణ్ రామ్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న అమిగోస్ అనే సినిమా త్వరలో విడుదలయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ సినిమాలో కల్యాణ్రామ్ త్రిపాత్రాభినయం చేస్తుండగా హీరోయిన్గా ఆశిక రంగనాథ్ నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేస్తుండగా... ఈ సినిమా నుంచి విడుదలవుతున్న ప్రతి అప్డేట్ కూడా సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి పెరిగేలా చేస్తుంది.  

తాజాగా ఈ సినిమా నుంచి 'యెకా యెకా' అంటూ సాగుతున్న ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ ఆధ్యంతం ఆకట్టుకునే విధంగా సాగింది. ఒక పక్క మ్యూజిక్ తో పాటు లిరిక్స్... అదే విధంగా విజువల్స్ కూడా కళ్ళను పక్కకు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. ప్రతి పాత్రలో కళ్యాణ్ రామ్ కూల్ గా కనిపిస్తూ తనదైన శైలిలో అదరగొట్టాడు.  గిబ్రాన్ ఈ పాటను స్వరపరిచారు. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం రాశారు.

ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోలతో బడా సినిమాలు నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద అంచనాలు మరింత పెరుగుతున్నట్లు అవుతోంది. కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ను తెలుగు ప్రేక్షకులకు ఇవ్వబోతుందని చెబుతోంది సినిమా యూనిట్.

కొత్త దర్శకుడు రాజేంద్రరెడ్డి చాలా కొత్త పాయింట్ తో ఈ సినిమా కథ రాసుకున్నారని చెబుతున్నారు. ఈ సినిమాకి గిబ్రాన్ అందించిన మ్యూజిక్ చిత్రాన్ని మరో లెవల్కి తీసుకువెళుతుందని అంటున్నారు. ఇక తాజాగా విడుదలైన పాట కూడా సినిమా మీద అంచనాలను పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View


Tags:    

Similar News