తిట్టేనోరు.. కొట్టే చెయ్యిని ఆపడం కష్టం అంటూ ఉంటారు. అలాగే నెటిజనులు ట్రోల్ చేయాలని కాచుకు కూర్చుంటే ఎవరూ వారిబారి నుండి తప్పించుకోలేరు. ట్రోల్ చేసేవారికి హీరోయిన్ల విషయంలో అవకాశం ఎక్కువగా దక్కుతుంది..కారణం డ్రెసింగ్. అదేదో వీడియోలో నాగబాబు చెప్పినట్టు.. అందరూ హీరోయిన్లను ట్రోల్ చేస్తారు కానీ చెడ్డీ వేసుకున్నాడని.. మడ్డిగా ఉన్నాడని హీరోలను ఎవరూ ట్రోల్ చేయరు. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ట్రోల్స్ బాధ తప్పడం లేదు.
జాన్వి కపూర్ కనిపిస్తే చాలు కెమెరాలు క్లిక్ మనిపిస్తారు. ఆ ఫోటోలు క్షణాల్లో సోషల్ మీడియాలోకి వచ్చేస్తాయి. జాన్వి ఎక్కడకు వెళ్ళినా ఈ ఫోటోల బెడద తప్పదు.. జిమ్ముకెళ్ళినా.. ఇంటి సందులోంచి బయటకు తొంగి చూసినా ఫోటోలు వెంటనే తీస్తారు. ప్రొఫెషనల్ ఫోటోషూట్ లకు అయితే హీరోయిన్లు చక్కగా రెడీ అయ్యి వస్తారు కానీ ఇలాంటి ఫోటోషూట్లకు వారేమీ రెడీ అవ్వరు కదా. దీంతో కొన్ని సందర్భాలలో క్యాజువల్ గా ఉంటారు. కానీ నెటిజనులు మాత్రం అవేమీ పట్టకుండా డ్రెస్ అలా ఉందని.. ఇలా ఉందని విమర్శలు చేస్తారు. ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం జాన్వికి కొత్తరకమైన విమర్శలు ఎదురయ్యాయి. అదేంటంటే జాన్వి తన బట్టలను మళ్ళీ మళ్ళీ వేసుకుంటుందట.
సహజంగా సెలబ్రిటీలు ఒకసారి వేసుకున్న దుస్తులను మరోసారి వేసుకోరు. దీంతో జాన్విపై ట్రోలర్లు విమర్శలు సంధించారు. ఈ విషయంపై రీసెంట్ గా జాన్వి ఒక షో లో స్పందించాల్సి వచ్చింది. జాన్వి ఈమధ్యే అనైతా ష్రాఫ్ అదజానియా చాట్ షో కు గెస్ట్ గా హాజరయింది. ఈ చాట్ షోలో డ్రెస్ రిపీట్ చేయడం పై వస్తున్న విమర్శల గురించి ప్రస్తావిస్తే "రోజూ ఒక కొత్త డ్రెస్ వేసుకునేంత డబ్బు నేనింకా సంపాదించలేదు" అంటూ తెలివైన ఆన్సర్ ఇచ్చింది. అంతే కాదు జిమ్ బయట తన ఫోటోలపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ "సినిమాలో నా నటన గురించి విమర్శలైతే చెప్పండి సీరియస్ గా తీసుకుంటాను.. అంతే కాని జిమ్ బయట నేను ఎలా ఉన్నాననేదానిపై విమర్శలైతే పట్టించుకోను.. అది నా పని కాదు" అంటూ స్ట్రాంగ్ అన్సర్ ఇచ్చింది. జనాలు ఊరికే ఏదో అనుకుంటారు కానీ.. శ్రీదేవికి తగ్గ కూతురే.