పూరీ జగన్నాథ్ సినిమా అంటేనే స్పెషల్ ఫ్యాన్స్ ఉంటారు. పూరీ పేరు చూసి థియేటర్లకు వెళ్లే వాళ్ల సంఖ్య లక్షల్లోనే ఉంటుందంటే.. అదేమీ పెద్ద పొగడ్త కాదు. ఇంతగా ఆడియన్స్ ను కట్టేయడంలోను.. ఆకట్టుకోవడంలోనూ పూరీ మేకింగ్ స్టైల్ కంటే.. డైలాగ్స్ లో పవర్ అనే విషయం ప్రతీ ఒక్కళ్లకి తెలుసు.
ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో పూరీ తీసిన ఇజం ఆడియో రిలీజ్ అయిపోయింది. అన్ని యాంగిల్స్ లోనూ సినిమా అదిరిపోతోందనే విషయం అర్ధమవుతూనే ఉంది. అయితే.. 'ఎయ్ ఎయ్ ఎయ్ రా' అంటూ ఓ సాంగ్ ఉంటుంది.. హీరోయిన్ ను టీజ్ చేస్తూ సాగే ఈ పాట మొదట్లోనే.. 'మళ్లీ ఇంకోసారి నాకు కనిపించావంటే.. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా.. పెళ్లయిందా అని కూడా చూడకుండా తాళి కట్టేస్తా' అంటూ హీరోయిన్ కి వార్నింగ్ ఇస్తాడు కళ్యాణ్ రామ్. తర్వాత ఆటోమేటిగ్గా హీరోయిన్ ని టీజ్ చేస్తూనే లవ్ అనే యాంగిల్ యాజ్ యూజవల్ గా పూరీ సినిమాల్లానే ఉంటుంది. కానీ సాంగ్ ప్రోమో చివర్లో హీరోయిన్ లాగి పెట్టి హీరోకి చెంపదెబ్బ ఒక్కటిస్తుంది.
వెంటనే 'ఏం పర్లేదు.. ఏం పర్లేదు.. ఏం పర్లేదూ..' అంటాడు హీరో. 'ఏం పర్లేదేంట్రా ఎదవా' అంటూ తిరిగి క్వశ్చన్ చేస్తుంది హీరోయిన్ అదితి ఆర్య. ఇలా హీరోని ఎదవా అని హీరోయిన్ తో అనిపించే ధైర్యం పూరీ తప్పితే ఎవరూ చెయ్యలేరు. అనిపించుకోవడానికి ధైర్యం ఉన్న హీరో కూడా కళ్యాణ్ రామ్ తప్ప వేరే ఎరూ ఉండరులెండి. ఏమైనా ఆ డైలాగ్ అంతగా పేలడానికి కారడానికి ఇద్దరినీ అభినందించాల్సిందే.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/