నీకు నా బ‌ట్ట‌ల‌తోనే స‌మ‌స్య.. రేప్ లు చేసేవాళ్ల‌తో కాదు!

Update: 2022-12-15 00:30 GMT
హిందీ రియాలిటీ షో బిగ్ బాస్ తో పాపుల‌రైన ఉర్ఫీ జావేద్ నిరంత‌ర ఫోటోషూట్ల గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. త‌న‌దైన విల‌క్ష‌ణ ఎంపిక‌ల‌తో ఈ భామ నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఒక మోడ‌ల్ గా ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తూ హెడ్ ట‌ర్న‌ర్ గా మారింది. చాలా త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ పాపుల‌రైన డిజైన‌ర్ కం మోడ‌ల్ గా ఉర్ఫీ పేరు మార్మోగుతోంది. అయితే ఈ భామ బోల్డ్ ఫోటోషూట్ల‌పై ఎప్ప‌టికప్పుడు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి.

తాజాగా మ‌రోసారి కోర్టు కేసులో చిక్కుకుంది ఈ భామ‌. ముంబైకి చెందిన ఒక ప్ర‌ముఖ‌ న్యాయవాది ఉర్ఫీపై దావా వేయడంతో న్యాయపరమైన చిక్కుల్లో పడింది. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉర్ఫీ తన బోల్డ్ దుస్తులను ధ‌రించి బ‌హిరంగ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తూ యువ‌త‌రాన్ని నాశ‌నం చేస్తోంద‌నేది స‌ద‌రు న్యాయ‌వాది ఫిర్యాదు.

ఉర్ఫీ డ్రెస్సింగ్ సెన్స్ లో ర‌క‌ర‌కాల వ‌స్తువులు కూడా ఇంత‌కుముందు చ‌ర్చ‌ల్లోకొచ్చాయి. వీటిలో జనపనార.. గాజు... ఇనుప వ‌స్తువులు ఉన్నాయి. ఇటీవలి సైకిల్ చైన్ వంటి ప్రత్యేకమైన వస్తువులతో రూపొందించిన దుస్తుల్లోను ప్ర‌యోగాలు చేసింది. రియాలిటీ షో కంటెస్టెంట్ గా అన్నివేళ‌లా ఊర్ఫీ సోషల్ మీడియాలో బాగా పాపులారిటీని ద‌క్కించుకుంటోంది. ఇప్ప‌టికే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉంది. తాజాగా తనపై విధించిన చట్టపరమైన ఆరోపణలను తిప్పి కొట్టాలని నిర్ణయించుకుంది.

ఊర్ఫీ జావేద్ తనపై దాఖలైన ఫిర్యాదుపై స్పందించింది. "నీకు నా బట్టలతో సమస్య ఉంది కానీ అత్యాచారం చేసే మగవారితో కాదా?" అని స‌ద‌రు న్యాయ‌వాదిని సూటిగా ప్ర‌శ్నించింది.  ప్రజలకు నా దుస్తుల‌తోనే సమస్య..కానీ అత్యాచారం చేసిన క్రూరమైన నేరాగాళ్ల‌తో కాదు... అని విరుచుకుప‌డింది. నాపై ఇంకా ఎన్ని పోలీసు ఫిర్యాదులు వచ్చాయో నాకు తెలియదు! వావ్.. నాపై అత్యాచారం చేస్తామ‌ని.., చంపేస్తానని బహిరంగంగా బెదిరించే వ్యక్తులపై ప్రజలకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని తెలిసి నేను ఆశ్చర్యపోతున్నాను. నా బట్టల వల్ల నీకు నాతో సమస్య ఉంది కానీ అత్యాచారం చేసి హత్య చేసే పురుషులతో కాదు?" అంటూ సుదీర్ఘ నోట్ లో కౌంట‌ర్ వేసింది.

ఇక న్యాయ‌వాదిని టీజ్ చేస్తూ ఊర్ఫీ తాజాగా మ‌రో వీడియోని కూడా షేర్ చేసింది. "నేను రెస్టారెంట్ లో ఉన్నప్ప‌టి వీడియో ఇది. ఇక్కడ ఈ దుస్తుల్లో చాలా బాగున్నాను. దయచేసి ఈ వీడియోను కోర్టులో సాక్ష్యంగా ఉపయోగించుకోండి (నా ఏకైక అభ్యర్థన)"అని టీజ్ చేసింది.

కేసు విషయానికి వస్తే .. ఉర్ఫీ జావేద్ పై ముంబైకి చెందిన న్యాయవాది అలీ కాషిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ అంధేరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదును నమోదు చేశారు. ఆమె బహిరంగంగా అసభ్యకరమైన చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడిందని న్యాయవాది ఆరోపించారు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.., ఉర్ఫీ జావేద్ ప్రస్తుతం సన్నీ లియోన్ - అర్జున్ బిజ్లానీ హోస్ట్ చేస్తున్న `రొమాన్స్` బేస్డ్ రియాలిటీ షో స్ప్లిట్స్‌విల్లా సీజన్ 14లో సంద‌డి చేస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News