8 ఏళ్ల క్రితం.. సరిగ్గా చెప్పాలంటే 2009 డిసెంబర్ 18న హాలీవుడ్ మూవీ అవతార్ విడుదలైంది. ప్రపంచ సినిమాను.. విజువల్ ఎఫెక్ట్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లిన ఈ చిత్రాన్ని.. దర్శకుడు జేమ్స్ కేమరాన్ రూపొందించాడు. కొంత కాలం క్రితం ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందంటూ చెప్పడంతో.. అవతార్ ఫ్యాన్స్ ఆనందానికి పట్టపగ్గాలు లేవు.
అయితే.. అవతార్ 2 ను మూవీని 2020 డిసెంబర్ కి రిలీజ్ చేస్తానన్నాడు జేమ్స్ కేమరాన్. అలాగే ఈ చిత్రానికి మరో మూడు సీక్వెల్స్ కూడా ఉంటాయన్నాడు. 2021.. 2024.. 2025 డిసెంబర్ లో వీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పడం చాలామందికి ఆలస్యం కలిగించింది. థీమ్.. కాన్సెప్ట్.. యాక్టర్స్.. అన్నీ సిద్ధంగా ఉన్నపుడు అంత ఆలస్యం ఎందుకో అని అనుకున్నారు. కానీ అవతార్ 2 చిత్రం ద్వారా ప్రపంచ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు. అవతార్2 మూవీ 3డీలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటివరకూ 3డీ చిత్రం చూడాలంటే ప్రత్యేకమైన కళ్లజోడు ధరించాలి.
కానీ కళ్లజోడు అవసరం లేకుండా 3డీ విజువల్స్ చూపించగలిగే టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయనున్నారు అవతార్ మేకర్స్. 60వేల ల్యూమెన్స్ ఉపయోగించి అత్యంత నాణ్యమైన ఇమేజెస్ ను అందించే.. ఆర్జీబీ లేజర్ ప్రొజెక్షన్ టెక్నాలజీతో.. అవతార్2 రూపొందుతోంది. ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్న ఈ సాంకేతికను అవతార్2 కోసమే ఉపయోగిస్తున్నారు. అవతార్ తర్వాత వరల్డ్ ఫిలిం ఎలా మారిందో.. అవతార్2 తర్వాత మరో కొత్త అనుభవం ఆడియన్స్ కు మిగిల్చేందుకు ప్రయత్నిస్తుండడంతోనే.. ఇంత ఆలస్యం జరుగుతోంది.. అదీ సంగతి.. అర్ధమైందా
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/