`చిన్నారి పెళ్లికూతురు`గా ఫేమస్ అయిన అవికాగోర్ `ఉయ్యాలా జంపాల` చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ ఆరంగేట్రం అదరగొట్టినా అటుపై నటించిన సినిమాలేవి కలిసి రాలేదు. ఇదే సమయంలో గ్లామర్ రోల్స్ కి ఈ బ్యూటీ దూరంగా ఉండటం మరింత ప్రతికూల పరిస్థితుల్లోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత కొన్నాళ్లకు అవికా గ్లామర్ ఎలివేషన్ విషయంలో పట్టువిడుపు ప్రదర్శిస్తోంది. ఇటీవల మేకర్స్ కి కొన్ని మినహాయింపులు ఇచ్చింది.
క్రేజ్ పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఫోటో సెషన్స్ లో తనలో ఇన్నర్ బ్యూటీని పరిచయం చేసింది. `నెట్` అనే చిత్రంలో కాస్త బోల్డ్ గా నటించిందనే టాక్ తనకు ప్లస్ అయినా కానీ అవికా ఫిట్ నెస్ పై శ్రద్ద కోల్పోయిందని బొద్దుగా మారిందని గుసగుసలు వినిపించాయి. అప్పట్లో తన శరీర సౌష్టవంలో చాలా మార్పులు వచ్చాయి. బొద్దు అందంతో చబ్బీ లుక్ లో కి మారిపోయింది. దీంతో అమ్మడి ఫోటోలు నెటిజనుల కంటపడినప్పుడు విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు. కొంత మేకోవర్ తో సన్నబడినా తిరిగి తన పాత రూపానికి మారుతోందనేది నెటిజనుల అభియోగం.
ఆ క్రమంలోనే బాడీ ఇమేజ్ సమస్య గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ``నన్ను నేను చాలా అసహ్యించుకుంటున్నాను. నా శరీరాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. అలాగని నేనేమీ బాధపడలేదు. నేను నా నటనపైనే దృష్టి పెడతాను. ఎందుకేంటే నేను అద్దంలోకి చూసుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడలేద``ని విమర్శలకు రివర్స్ లో కౌంటర్ ఇచ్చింది.
ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు విమర్శలపై ఎటాకింగ్ దిగితే మరిన్ని విమర్శలు ఎదుర్కోవడం తప్ప ఉపయోగం లేదు. అందుకేనేమో విమర్శకుల దారిలోకే వెళ్లి సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. నా అందాన్ని నేను ఇష్టపడలేదు. వృత్తిని మాత్రమే ప్రేమిస్తున్నాను...నటననే శ్వాశిస్తున్నాని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేసినట్లుంది. ప్రస్తుతం అవికాగోర్ నాగచైతన్య కథనాయకుడిగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `థాంక్యూ`లో నటిస్తోంది. ఇందులో మెయిన్ లీడ్ లో రాశీఖన్నా నటిస్తుండగా...కీలక పాత్రలో అవికా నటిస్తోంది. అలాగే `10 క్లాస్ డైరీస్` అనే మరో చిత్రంలోనూ అవికా నటిస్తోంది.