'అర్జున్ రెడ్డి' సక్సెస్ తో విజయ్ దేవరకొండ.. దర్శకుడు సందీప్ వంగాలకు మాత్రమే కాదు ఆ సినిమాలో విజయ్ ఫ్రెండ్ పాత్ర పోషించిన రాహుల్ రామకృష్ణకు కూడా మంచి బ్రేక్ వచ్చింది. ఆ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఉన్న బిజీ కమెడియన్లలో ఒకరిగా మారిపోయాడు రాహుల్. 'అర్జున్ రెడ్డి' ఒక్క సినిమానే అన్నట్టు కాకుండా 'సమ్మోహనం'.. 'చిలసౌ'.. 'హుషారు' సినిమాల్లో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా లీడ్ రోల్స్ కూడా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.
ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా తనకు లా చదవాలని ఉందని అంటున్నాడు. "నేను ఇప్పుడు పని చేస్తున్న వండర్ఫుల్ ఫిలిమ్స్ తో పాటుగా ఈ ఏడాది చదువు తో ఉన్న రిలేషన్ ను లా చదివి పూర్తి చేద్దామని అనుకుంటున్నాను. దాంతో పాటుగా పియానో వాయించడంలో బేసిక్ లెవెల్స్ కూడా కంప్లీట్ చేయదలుచుకున్నాను." అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు. ఒకవైపు లాయర్ గా నోటితో వాదించడం.. మరోవైపు పియానోను చేతులతో వాదించడం.. రచ్చ కాంబినేషన్ కదా?
ఈ ట్వీట్ కు సందీప్ కిషన్ రిప్లై ఇస్తూ "సినిమా వెటకారం నుండి.. లా వెటకారం' అన్నాడు. మరోవైపు రాహుల్ రవీంద్రన్ "ఇంటికి రా రాహుల్.. మా ఇంట్లో పియానో ఉంది. చిన్మయి అల్రెడి బేసిక్స్ నేర్చుకుంటోంది" అంటూ రెస్పాన్స్ ఇచ్చాడు. దీనికి సమాధానం ఇస్తూ.. 'నేను కాస్త నేర్చుకొని కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు వస్తా" అన్నాడు.