యంగ్ డైరెక్ట‌ర్ 35 కోట్లు ఫీజు అడిగాడంటూ..!

Update: 2022-05-18 03:08 GMT
ఇటీవ‌లే పాన్ ఇండియా హిట్టు కొట్టి త‌దుప‌రి సీక్వెల్ పై దృష్టి సారించిన ప్ర‌ముఖ స్టార్ హీరోతో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో దూకుడుమీదున్న త‌మిళ యువ‌ద‌ర్శ‌కుడి కాంబినేష‌న్ గురించి ఇటీవ‌ల సౌత్ అంత‌టా విస్త్రంగా చ‌ర్చ సాగింది. ఈ కాంబినేష‌న్ లో మూవీ త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళుతుంద‌న్న ప్ర‌చారం జోరుగా సాగింది. కానీ అది ఇంత‌వ‌ర‌కూ సాధ్య‌ప‌డ‌లేదు. దానికి కార‌ణ‌మేమిటా అన్న‌ది ఆరా తీస్తే షాకిచ్చే నిజం తెలిసింది.

ఆ డైరెక్ట‌ర్ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ సూప‌ర్ స్టార్ ని డైరెక్ట్ చేస్తూ బిజీగా ఉండ‌గా.. ప్ర‌స్తుతం స‌ద‌రు టాప్ హీరో త‌న పాన్ ఇండియా స్టార్ డ‌మ్ ని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లే ప్ర‌య‌త్నంలో సీక్వెల్ ని అత్యంత భారీగా ప్లాన్ చేస్తున్నాడు. అయితే స‌ద‌రు హీరో ఎప్ప‌టికైనా ఆ త‌మిళ డైరెక్ట‌ర్ తో సినిమా చేసే ఛాన్సుందా అంటే లేనే లేద‌ట‌.

దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. అత‌డు ఏకంగా 35కోట్ల పారితోషికం డిమాండ్ చేయ‌డంతో ప్రాజెక్ట్ ని విర‌మించుకున్నార‌న్న గుస‌గుస ఇప్పుడు వినిపిస్తోంది. నిజానికి స‌ద‌రు యంగ్ డైరెక్ట‌ర్ వ‌రుస హిట్ల‌తో దూకుడుమీదున్నాడు.

అత‌డు తెర‌కెక్కించిన ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఏకంగా 200 కోట్లు వ‌సూలు చేసింది. ప్ర‌స్తుతం వ‌రుస ఫ్లాపుల‌తో డీలా ప‌డిపోయిన బాలీవుడ్ స్టార్ హీరోకే దారి చూపించే ప‌నిలో ఉన్నాడు.  అందుకే ఇంత పెద్ద మొత్తం డిమాండ్ చేసాడా? అంటూ ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

పైగా ఆ స్టార్ హీరో న‌టించే పాన్ ఇండియా మూవీకి లైకా ప్రొడక్షన్స్ ఫైనాన్సింగ్ స‌పోర్ట్ ఉంది. స‌ద‌రు ప్రొడక్షన్ హౌస్ 2.0, కత్తి - దర్బార్ సహా అనేక తమిళ మెగా హిట్ చిత్రాల‌కు ఆర్థికంగా మ‌ద్ధ‌తునిచ్చింది. స్టార్ల‌కు భారీ పారితోషికాలు చెల్లిస్తోంది.

అదే క్ర‌మంలో యంగ్ డైరెక్ట‌ర్ అంత డిమాండ్ చేసి ఉంటాడ‌ని కూడా తెలుస్తోంది. ఇక ఆ యంగ్ డైరెక్ట‌ర్ అడిగినంతా ఇవ్వ‌లేకే ఆ ప్రాజెక్ట్ ని ఆపేసార‌న్న వార్త మాత్రం అభిమానులు డైజెస్ట్ చేసుకోలేనిది!
Tags:    

Similar News