యువ హీరో ఎక్కడా తగ్గేదేలే..!

Update: 2022-07-16 05:30 GMT
టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్.. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత 'ఎస్ ఆర్ కళ్యాణ మండపం' సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు.

అయితే ఈ ఏడాది పాండమిక్ తర్వాత వచ్చిన 'సెబాస్టియన్ PC524' సినిమా కిరణ్ కు నిరాశే మిగిల్చింది. అలానే ఇటీవల విడుదలైన 'సమ్మతమే' చిత్రం కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలు పరాజయం అందుకున్నప్పటికీ.. యువ హీరో ఏమాత్రం డీలా పడలేదు.

వరుస ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతూ రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నాడు కిరణ్. ఇప్పుడు అతని చేతిలో అరడజనుకు పైగానే సినిమాలు ఉన్నాయి. అవి కూడా టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో రూపొందుతున్నవి కావడం విశేషం. నిన్న శుక్రవారం హీరో పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి.

కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామక్రిష్ణ కూతురు కోడి దివ్య దీప్తి నిర్మాణంలో 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' అనే సినిమా రూపొందుతోంది. కోడీ దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీధర్ గాదే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందే 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే సినిమాలో కిరణ్ హీరోగా నటిస్తున్నారు. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా వచ్చిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్ లో 'మీటర్' అనే మూవీ చేస్తున్నాడు. రమేష్ కాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బర్త్ డే స్పెషల్ గా నిన్న టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇది పక్కా మాస్ బొమ్మ అని తెలియజేసారు.

ఇదే క్రమంలో సీనియర్ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో కిరణ్ హీరోగా 'రూల్స్ రంజన్' అనే సినిమా తెరకెక్కుతోంది. రత్నంకృష్ణ దీనికి దర్శకుడు. స్టార్ లైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దివ్యాంగ్ లవానియా మరియు వి. మురళీకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లేటెస్టుగా వచ్చిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇవే కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టాడు కిరణ్ అబ్బావరం. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్ధలో ఒకటి.. ఏషియన్ వారి బ్యానర్ లో మరొక సినిమా కమిట్ అయినట్లు సమాచారం. అలానే ఓ కొత్త ప్రొడక్షన్ హౌస్ లోనూ యువ హీరో ఓ సినిమా చేయనున్నాడు.

ఇలా కిరణ్ లైనప్ లో ప్రస్తుతం ఏడు సినిమాలున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ లో ఇన్ని ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్న మరో కుర్ర హీరో లేడనే చెప్పాలి. కాకపోతే కెరీర్ ప్రారంభంలో అన్నీ కమర్షియల్ ఎంటర్టైనర్లు మాస్ మసాలా సినిమాలు చేస్తుండటం పై కొందరు విమర్శలు చేస్తున్నారు. హీరోగా నిలదొక్కుకోవాలంటే అన్ని రకాల జోనర్స్ చేయాలని.. విభిన్నమైన సినిమాలు ట్రై చేయాలని సూచిస్తున్నారు.
Tags:    

Similar News