యువ హీరో దెబ్బకి అడ్ర‌స్ లేకుండా పోయిన ప్రొడక్షన్ హౌస్..!

Update: 2021-01-09 02:30 GMT
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ముఖ్యంగా కోట్లతో కూడిన సినిమా వ్యవహారాల్లో నిర్మాతల పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా హిట్ అయితే లాభాల్లో ఉంటారు.. ప్లాప్ అయితే నష్టాలు తెచ్చుకుని, ఫైనాన్స్ కట్టుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. టాలీవుడ్ లో ఒకప్పుడు ఎన్నో హిట్ సినిమాలు తీసిన ఓ నిర్మాణ సంస్థ.. ఓ యువ హీరో దెబ్బకు ఇప్పుడు ఇండస్ట్రీలో అడ్రెస్ లేకుండా పోయే సిచ్యుయేషన్ వచ్చేసిందట.

ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఆ ప్రొడక్షన్ హౌస్ స్టార్ హీరోలందరితో సినిమాలు తీసి కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో హవా నడిపించింది. ఎన్నో సూప‌ర్ హిట్స్.. ఎన్నో డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్నప్పటికీ ఓ యంగ్ హీరోతో తీసిన సినిమా వల్ల తీవ్ర నష్టాలు చవి చూసారట. ఓ క్రేజీ హీరోతో భారీ బడ్జెట్ తో సినిమా చేస్తే అది కాస్తా డిజాస్టర్ అయింది. ఆ హీరో తమ నిర్మాణ సంస్థని గట్టెక్కిస్తాడని అనుకుంటే అదే సినిమాతో పాతాళంలోకి పడిపోయారు. ఈ సినిమాకి వచ్చిన నష్టం వారు నిర్మించిన ఏ ప్లాప్ మూవీకి రాలేదట. దీంతో ఎప్పుడూ ఏదొక సినిమా వర్క్ తో క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉండే ఆ మూవీ ఆఫీసు ఇప్పుడు క‌ళ త‌ప్పి బోసిపోయిందట. దీంతో ఫిల్మ్ ఛాంబ‌ర్ లో అంతా యువ హీరో పుణ్యమే ఇదంతా అని మ‌నోడిపై సెటైర్లు వేస్తున్నారు.

వాస్త‌వానికి ఈ సినిమా ఫ్లాప్ విష‌యంలో ఆ హీరో చేసిందేమీ లేదు. సినిమా కంటెంట్ అలా ఉంటే అతను మాత్రం ఏమి చేస్తాడు. కాకపోతే ఈ సినిమాకి మ‌నోడు బాగానే పారితోషికం తీసుకున్నాడట‌. అయితే చివరకు సినిమాకి వచ్చిన రిట‌ర్న్స్ చూసుకుంటే యువ హీరోకి ఇచ్చినంత కూడా రాలేద‌ట. ఈ నేపథ్యంలో ఆ ప్రొడ్యూసర్ మరో సినిమాని అనౌన్స్ చేయలేదు. మరి రాబోయే రోజుల్లో ఆ నిర్మాణ సంస్థలో సినిమా ప్రకటిస్తారేమో చూడాలి.
    

Tags:    

Similar News