యంగ్‌ హీరో లాక్‌ డౌన్‌ టైమ్‌ పాస్‌ ఇలా

Update: 2020-07-23 06:45 GMT
ఎప్పుడు షూటింగ్స్‌ తో బిజి బిజీగా ఉండే సినీ స్టార్స్‌ కరోనా కారణంగా గత నాలుగు నెలలుగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. షూటింగ్స్‌ కు అనుమతులు వచ్చినా కూడా కరోనా భయంతో స్టార్స్‌ ఎవరు కూడా ఇంటి నుండి బయటకు వెళ్లడం లేదు. పిల్లలు ఉన్న హీరోలు వారితో ఫుల్‌ టైం పాస్‌ చేస్తుంటే ఇతర స్టార్‌ వారి వారి పెట్స్‌ తో టైమ్‌ పాస్‌ చేస్తున్నారు. యంగ్‌ హీరో నాగశౌర్య కూడా తన పెట్‌ డాగ్స్‌ తో ఎక్కువ సమయం గడుపుతూ గడుపుతున్నాడు.

తన పెట్‌ తో గడుపుతున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉన్నాడు. ఇదే సమయంలో అతడు వర్కౌట్స్‌ చేస్తూ ఉన్నాడు. ఎక్కువగా పెట్‌ డాగ్‌ తో గడుపుతున్న నాగశౌర్య దానికి సంబంధించిన వీడియోను కూడా ఫాలోవర్స్‌ తో పంచుకున్నాడు. ఈయన ప్రస్తుతం రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

ఈ ఏడాది ఆరంభంలో అశ్వథ్థామ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నాగశౌర్య ఆ సినిమాతో కమర్షియల్‌ సక్సెస్‌ మాత్రం అందుకోలేక పోయాడు. కరోనా పరిస్థితి నుండి బయట పడ్డ తర్వాత నాగశౌర్య ఆ రెండు సినిమాలను మొదలు పెట్టే అవకాశం ఉంది.

Full View

Tags:    

Similar News